Begin typing your search above and press return to search.

నిమజ్జనంలో భారీ విషాదం.. 11 మృతి.. ఎక్కడంటే?

By:  Tupaki Desk   |   13 Sep 2019 5:54 AM GMT
నిమజ్జనంలో భారీ విషాదం.. 11 మృతి.. ఎక్కడంటే?
X
ఘోరం చోటు చేసుకుంది. గణేశ్ నిమజ్జనంలో చోటు చేసుకున్న అపశ్రుతితో పెద్ద ఎత్తున విషాదం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ సమీపంలో ఈ భారీ దారుణం చోటు చేసుకుంది. ఖట్లాపుర ఘాట్ వద్ద గణేశ్ నిమజ్జనానికి వెళ్లిన ఒక బోటు మునిగిపోవటంతో 11 మంది జలసమాధి అయ్యారు.

ఈ రోజు తెల్లవారుజామున (శుక్రవారం) 4.30 గంటలకు చోటు చేసుకున్న ఈ ఘోరంలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గణేశ్ నిమజ్జనం కోసం 16 మందిని తీసుకెళుతున్న బోటు ఒక్కసారిగా మునిగిపోయింది. ఆ వెంటనే స్పందించిన గజ ఈతగాళ్లు ఐదుగురిని రక్షించినట్లు భోపాల్ ఐజీ యోగేష్ దేశ్ ముఖ్ వెల్లడించారు.

ఇప్పటివరకూ రక్షించిన వారు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? అన్న విషయం మీద గాలిస్తున్నారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ మంత్రి పీసీ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.

మరణించిన వాంతా పిప్లాని ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో పదహారు మంది కంటే ఎక్కువే ప్రయాణిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంతన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.