Begin typing your search above and press return to search.

ఎయిర్ పోర్ట్ లో 11 మంది ఆర్మీ సిబ్బంది అరెస్ట్..ఎందుకంటే?

By:  Tupaki Desk   |   18 Nov 2020 12:30 PM GMT
ఎయిర్ పోర్ట్ లో 11 మంది ఆర్మీ సిబ్బంది అరెస్ట్..ఎందుకంటే?
X
సాధరణంగా మనదేశంలో ఆర్మీ జవాన్లకు ఉండే రెస్పెక్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా వారిని గౌరవిస్తారు. దేశం కోసం - దేశంలో ఉన్న ప్రజల కోసం తమ ప్రాణాలని కూడా పణంగా పెడుతుంటారు. అలాగే కుటుంబ సభ్యులకి దూరంగా ఉంటారు. అలాగే దేశ రక్షణ లో భాగంగా ఉగ్రవాదుల దాడుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు. అయినా కూడా ఆర్మీ లో చేరాలనే వారి సంఖ్య మాత్రం తగ్గదు. దేశం కోసం ఒక్కరోజైనా ఆర్మీ లో పని చేయాలని అనుకుంటారు. అయితే , ఆర్మీ పేరును ఉపయోగించుకొని ఓ గ్యాంగ్ ఎదో పెద్ద ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. తాజాగా గౌహతి ఎయిర్ పోర్ట్ సమీపంతో ఆర్మీ డ్రెస్ వేసుకొని అనుమానాస్పదంగా తిరుగుతున్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారం చేయగా షాకింగ్ నిజాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. వారిలో ఏ ఒక్కరి దగ్గర కూడా ఆర్మీ ఉద్యోగి అని నమ్మడానికి ఒక్క ఐడి కూడా లేదు. అలాగే వారు నివశించే ఇంట్లో సోదాలు చేయగా .. ఇంట్లో అన్నీ నకిలీ గుర్తింపు కార్డులు బయటపడటంతో అందర్నీ విచారణ చేస్తున్నారు. అసలు ఈ 11 మంది ఎవరు - ఎందుకు ఆర్మీ యూనీఫామ్ వేసుకుని ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నారు అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అసోంలోని గౌహతి లో ఎల్ జీబీఐ ఎయిర్ పోర్టు పరిసరాల్లో 24 గంటలు కట్టుదిట్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసోంలో నక్సల్స్ కార్యకలాపాలు ఎక్కువగా ఉండటంతో పోలీసులు నిత్యం గస్తీ నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఎల్ జీబీఐ ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో కొందరు ఆర్మీ డ్రెస్ వేసుకొని అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. ఆర్మీ దుస్తుల్లో ఉన్న యువకులను పోలీసులు ప్రశ్నించారు. తాము ఆర్మీ సిబ్బంది అని ఒకసారి - సెక్కూరిటీ సిబ్బంది అని మరోసారి ఇలా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో స్థానిక పోలీసులకు అనుమానం వచ్చింది. అయితే , అక్కడ ఉన్న నలుగురు యువకులు పోలీసులపై పెత్తనం చలాయించడానికి ప్రయత్నించి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. వెంటనే గస్తీ తిరుగుతున్న పోలీసులు ఆ నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అలాగే ఆ నలుగురితో పాటుగా మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకోని విచారణ చేస్తున్నారు.

ఇక 11 మంది వారి గుర్తింపు కార్డులు చూపించడంలో విఫలం అయ్యారని గౌహతి అడిషనల్ పోలీసు కమిషనర్ దేబ్రాజ్ ఉపాధ్యాయ అన్నారు. ఆ 11 మంది అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారని, వారి ఇంట్లో సోదాలు చెయ్యగా అనేక నకిలీ గుర్తింపు కార్డులు (ఐడీ కార్డులు) బయటపడ్డాయని గౌహతి అడిషనల్ పోలీసు కమిషనర్ దేబ్రాజ్ ఉపాధ్యాయ చెప్పారు. 11 మంది ఎవరు , వీరి ప్లాన్ ఏమిటి , ఎందుకు ఆర్మీ యూనీఫామ్ వేసుకున్నారు అంటూ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. ఎయిర్ పోర్టు దగ్గర ఆర్మీ దస్తుల్లో ఏకంగా ఒకేసారి 11 మంది నకిలీ ఆర్మీ ఉద్యోగులు అనుమానాస్పదంగా తిరుగుతూ అరెస్టు కావడంతో ఈ ఘటన పై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది.