Begin typing your search above and press return to search.
అమెరికాలో కాల్పులు..11 మంది మృతి
By: Tupaki Desk | 28 Oct 2018 5:50 AM GMTఅమెరికాలో మరో మారణహోమం జరిగింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పీట్స్ బర్గ్ పట్టణంలో యూదులు టార్గెట్ గా ఓ అమెరికన్ దుండగుడు జరిపిన దాడిలో 11 మంది చనిపోగా.. 12 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
పీట్స్ బర్గ్ లోని యూదుల ప్రార్థనామందిరం (సినగోగ్)లో ఓ యూదు కుటుంబానికి చెందిన పాప నామకరణోత్సవం జరుగుతోంది. వారంతా ప్రార్థనల్లో మునిగితేలి ఉండగా.. దుండగుడు ప్రవేశించి యూదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. దాడి అనంతరం నిందితుడు ‘రాబర్ట్ బోయర్స్’ పోలీసులకు లొంగిపోయాడు. ఇది విద్వేశపూరిత దాడి అని.. ఉగ్రవాద కోణం లేదని పోలీసులు తేల్చారు.
శ్వేత జాతీయుడైన రాబర్ట్ బోయర్స్ మత చాంధసవాదంతోనే యూదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పరిగెత్తుతూ కనిపించాడని స్థానికులు చెప్పారు. ఈ డాడి ఘటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు.