Begin typing your search above and press return to search.
ఢిల్లీలో ఒకే ఇంట్లో 11 మంది సూసైడ్స్?
By: Tupaki Desk | 1 July 2018 10:19 AM GMTదేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసిన ఒక ఘోరం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఒకే ఇంటికి చెందిన 11 మంది ఉరి వేసుకొని మరణించిన వైనంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున ఉరి వేసుకోవటం షాకింగ్ గా మారటమే కాదు.. దీనికి కారణం ఏమిటన్నది పెద్ద ప్రశ్నగా మారింది. మరణించిన వారిలో ఏడుగురు మహిళలు.. నలుగురు పురుషులు ఉన్నారు. మృతులు మరణించిన విధానాన్ని చూస్తే పలు అనుమానాలకు తావిచ్చేలా ఉంది.
ప్రత్యక్ష సాక్ష్యుల సమాచారం ప్రకారం.. మృతుల కళ్లకు గంతలతో పాటు నోటికి అడ్గుగా గుడ్డలు కట్టి ఉండటంతో.. ఏం జరిగిందన్నది ఇప్పుడు సందేహంగా మారింది. అందరూ ఇంటి సీలింగ్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడిన వైనంపై చుట్టుపక్కల వారు భయాందోళనలకు గురి అవుతున్నారు.
సామూహిక ఆత్మహత్యలకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాల్ని పోస్ట్ మార్టమ్ కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. ఆర్థిక సమస్యలతోనే వీరు ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఫర్నీచర్ వ్యాపారం చేసే ఈ కుటుంబం ఆర్థిక సమస్యలతో సూసైడ్ చేసుకున్నారా? లేదంటే.. ఎవరైనా దుర్మార్గంగా ఉరి వేసి చంపేశారా? అన్నది అనుమానంగా మారింది.
మరణించిన వారిలో 75 ఏళ్ల వయస్కుల నుంచి పన్నెండేళ్ల చిన్నారి వరకూ ఉండటం గమనార్హం. మృతదేహాల్ని పోలీసులు గుర్తించారు. వారి వెల్లడించిన వివరాల ప్రకారం..
1. నారాయణ (75)
2. ప్రతిభ (60)
3. ప్రియాంక (30)
4. భుషి (46)
5. సవిత (46)
6. లలిత్ (42)
7. టీన (38)
8. నీతూ (24)
9. మీను (18)
10. ధృవ్ (12)
11. శివం (12)