Begin typing your search above and press return to search.

వీకెండ్ లో సైకో వీరంగం.. కాల్పులతో 11 మందిని చంపేశారు

By:  Tupaki Desk   |   6 Sep 2021 3:53 AM GMT
వీకెండ్ లో సైకో వీరంగం.. కాల్పులతో 11 మందిని చంపేశారు
X
గన్ కల్చర్ ఎక్కువగా ఉండే అమెరికాలో మహా విషాదం చోటు చేసుకుంది. ఇష్టారాజ్యంగా ఆయుధాల్ని అప్పగించేసిన ఆ దేశంలో తరచూ ఏవో ఒక దారుణాలు చోటు చేసుకుంటాయి. అయితే.. గడిచిన కొంతకాలంగా ఎవరైనా ఉన్మాదులు జరిపే కాల్పుల్లో అమాయకులు చనిపోతున్నారు. తాజాగా అలాంటి ఉదంతమే మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరగటమేకాదు.. ఏకంగా 11 మంది బలయ్యారు. ఈ వీకెండ్ లో చోటు చేసుకున్న ఈ దారుణాలు.. అమెరికన్లను కదిలిస్తున్నాయి. మొత్తం మూడు వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఉదంతాల వివరాల్లోకి వెళితే..

మూడు వేర్వేరు ప్రాంతాల్లో శని..ఆదివారాల్లో చోటు చేసుకున్న ఉన్మాదుల కాల్పుల కారణంగా మొత్తం 11 మంది అమెరికన్ పౌరులు ప్రాణాలు పోయాయి. మరణించిన వారిలో ఒక బాలింత.. మరో పసికందు ఉండటం అందరికి కన్నీళ్లు తెప్పిస్తోంది. బుల్లెట్ ఫ్రూప్ ధరించిన ఒక సైకో లేక్ ల్యాండ్ లోని ఒక ఇంట్లోకి ప్రవేశించి.. 11 ఏళ్ల బాలిక.. ఒక బాలింతతో పాటు ఆమె ఒడిలోని పసిగుడ్డును దారుణంగా కాల్చి చంపేశారు. పక్కింట్లోని మహిళ ప్రాణాల్ని తీశారు. అయితే.. అతడిపై కాల్పులు జరిపిన పోలీసులు అతన్ని ప్రాణాలతో పట్టుకున్నారు. అయితే.. అతనెందుకు కాల్పులు జరిపారన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు.

మరో ఉదంతంలో హూస్టన్ లో ఆదివారం ఉదయం ఒక ఇంట్లో కాల్పులు జరిగాయి. ఇందులోఇద్దరు పిల్లలతో సహా నలుగురు మరణించారు. అనంతరం ఆ ఇంటిని తగలబెట్టారు. మరణించిన వారిలో ఇద్దరు పెద్దలు సుమారు యాభై ఏళ్లు ఉండగా.. పిల్లల వయసు 10 - 13 ఏళ్ల మధ్యలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఇంట్లో జరిగిన గొడవలే కాల్పులకు కారణంగా అనుమానిస్తున్నారు.

మూడో ఉదంతంలో వాషింగ్టన్ కు దగ్గర్లో శనివారం రాత్రి కల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఉదంతంలో మొత్తం ముగ్గురు ప్రాణాలు వదిలారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఈ కాల్పులకు సంబంధించి ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ కాల్పులు ఎందుకు జరిగాయో బయటకు రాలేదు.