Begin typing your search above and press return to search.
తీహార్ జైల్లో ఖైదీలు చేసిన పనికి అధికారులకు షాక్
By: Tupaki Desk | 3 March 2017 9:43 AM GMTతీహార్ జైల్లోని ఖైదీల ప్రవర్తన ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక బ్యారక్ లో ఉన్న ఖైదీలు ఎవరికి వారు.. తమ తలను తాము పగలకొట్టుకున్నవిచిత్ర వైనం ఇప్పుడు జైలు అధికారులకు అర్థం కానిదిగా మారింది. ఇలాంటి వింత వైఖరిని ఒకరిద్దరు కాకుండా.. దాదాపు పదకొండు మంది ఖైదీల వరకూ ఇదే తీరును ప్రదర్శించటం గమనార్హం.
స్పెషల్ సెక్యూరిటీ సెల్ లో ఉన్న పదకొండు మంది ఖైదీల్లో ఒకరు.. ఈ తెల్లవారు జామున తనకు ఆరోగ్యం బాగోలేదని.. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరారు. దీంతో.. గార్డులు.. ఇతర సిబ్బంది తాళాలు తీసుకొని వచ్చారు.అంతలో మిగిలిన ఖైదీలు సైతం తమకు ఆరోగ్యం బాగోలేదని.. తమను కూడా ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరారు.
ఒకేసారి ఇంతమంది ఖైదీల్ని బయటకు తీసుకెళ్లటం సాధ్యం కాదని చెబుతున్నా.. వారు మాత్రం ససేమిరా అనటమే కాదు.. తమ తలల్ని తాము గోడకేసి కొట్టుకోవటం మొదలెట్టారు. ఊహించని ఈ పరిణామానికి జైలు సిబ్బంది షాక్ తిన్నారు. ఏం చేయాలో తోచని వేళ.. గోడకేసి కొట్టుకోకుండా ఉండేలా ప్రయత్నించారు. కానీ.. వారు మాత్రం ఎంతకూ వినకుండా గోడకేసి కొట్టుకోవటంతో ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించారు. ఇలా గోడకేసికొట్టుకున్న వారికి గాయాలు కావటంతో వారికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఈ ఉదంతంపై జైలు అధికారులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/