Begin typing your search above and press return to search.

సరిహద్దులు దాటేస్తే.. స్వీట్లు ఇచ్చి పంపారు

By:  Tupaki Desk   |   6 July 2015 5:12 PM GMT
సరిహద్దులు దాటేస్తే.. స్వీట్లు ఇచ్చి పంపారు
X
భారత్‌.. పాక్‌ సరిహద్దులన్న వెంటనే నిత్యం కాల్పులు.. నిబంధనల ఉల్లఘిస్తూ రెచ్చగొట్టే చర్యల ద్వారా భారత్‌ సైనికుల్ని కవ్వింపులక పాల్పడటం లాంటివి మామూలే. ఇలాంటి చర్యలతో నిత్యం ఉద్రిక్తంగా ఉండే భారత్‌.. పాక్‌ సరిహద్దుల మధ్య ఒక అపురూప సంఘటన చోటు చేసుకుంది. దీనికి ఒక పదకొండేళ్ల బాలుడి తప్పిదం అయినా.. రెండు దేశాల మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలన్న విషయాన్ని తెలియజేసేలా వ్యవహరించిన భారత్‌ సైన్యం చర్యలకు ఇప్పుడు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన 11 ఏళ్ల బాలుడు పొరపాటున భారత్‌ భూబాగంలోకి వచ్చేశాడు. పీఓకేలోని లాస్వా ప్రాంతానికి చెందిన ఈ పదకొండేళ్ల బాలుడు పొరపాటున భారత్‌ సరిహద్దుల్లోకి వచ్చేసిన విషయాన్ని గుర్తించారు. వెంటనే అతన్ని తమతో తీసుకెళ్లిన భారత్‌ సైన్యం.. హాట్‌లైన్‌ ద్వారా పాక్‌ మిలటరీకి ఈ సమాచారాన్ని అందించింది.

అనంతరం ప్లాగ్‌ మీటింగ్‌లో రెండు దేశాలకు చెందిన అధికారులు చర్చలు జరిపి.. ఆ అబ్బాయిని పాక్‌ సైన్యానికి అప్పజెప్పారు. ఈ సందర్భంగా బాలుడికి స్వీట్లు.. కొత్త బట్టలు కొనిపించి మరీ సాగనంపారు. ఈ ఘటన పట్ల రెండు దేశాల్లోని పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.