Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ : వలస కార్మికులు 110 మంది మృతి!

By:  Tupaki Desk   |   10 July 2020 11:15 AM IST
లాక్ డౌన్ :  వలస కార్మికులు 110 మంది మృతి!
X
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ..మహమ్మారిని అరికట్టడానికి ప్రధాని మోడీ మార్చి 25వ తేదీ రాత్రి హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించారు. ఏ మాత్రం ముందస్తు ప్రణాళికలు లేకుండా లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రతి ఒక్కరు అనేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా లాక్ డౌన్ ప్రభావం వలస కార్మికుల పై ఎక్కువగా పడింది. ఉన్నపళంగా ఉద్యోగ,ఉపాధి కోల్పోవడంతో వారి పరిస్థితి రోడ్డున పడ్డట్లయింది. దీంతో వేలాది మంది వలస కార్మికులు కాలి నడకనే వేల కి.మీ నడుచుకుంటూ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఇక , లాక్ డౌన్ నిబంధనలను సడలించిన ప్రభుత్వం వలస కార్మికుల తరలింపు కోసం శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఒక ప్రకటన ప్రకారం ఇప్పటివరకు లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన దాదాపు 63.07లక్షల మంది వలస కార్మికులను 4611 శ్రామిక్ రైళ్ల ద్వారా వారి సొంత రాష్ట్రాలకి తరలించారు.

ఇకపోతే , తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తరువాత మే 1 నుండి వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా రైళ్లను ప్రారంభించిన తరువాత ఇప్పటివరకూ వివిధ రైల్వే స్టేషన్ల ఆవరణలో 110 మంది వలస కార్మికులు మృతి చెందారు. ఇందులో కొందరు అనారోగ్యంతో, కొందరు కరోనాతో మృతి చెందారు. అయితే , ఈ జాబితాలో రైల్వే పట్టాలపై గుర్తించిన మృతదేహాలను చేర్చలేదు. వలస కార్మికులకు సంబంధించి రాష్ట్రాలు వెల్లడించిన వివరాల్లో ఈ విషయం వెల్లడైంది. వలస కార్మికులపై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న కేసుతో సహా వివిధ అధికారిక ఫోరమ్స్‌లో ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది.

రైల్వే ఆవరణలో మరణించిన వలస కార్మికుల్లో ఏ ఒక్కరూ ఆహారం,నీళ్లు అందక చనిపోయిన దాఖలా లేదని పేర్కొంది. శ్రామిక్ రైళ్లలో ప్రభుత్వమే ఉచితంగా ఆహారం,నీళ్లు సప్లై చేసినట్లు వెల్లడించింది. అయితే రైల్వే ఆవరణలో ఏదైనా అనుకోని సంఘటనతో మృతి చెందిన వారికి మాత్రమే రైల్వే నుంచి పరిహారం అందుతుంది. సాధారణంగా ప్రతీ నెలా దాదాపు 700 దరఖాస్తులు పరిహారం కోరుతూ రైల్వే ట్రిబ్యునల్‌లో దాఖలవుతుంటాయి. ఇందుకోసం రైల్వే ప్రతీ నెలా రూ.8లక్షలు ఖర్చు చేస్తుంది. అయితే కొన్ని రాష్ట్రాలు శ్రామిక్ రైళ్లలో ప్రయాణించాలంటే టికెట్ ఖర్చు వారినే భరించాలి అని చెప్పగా ..కొన్ని రాష్ట్రాలు ప్రభుత్వ ఖజానా నుండి తీసి శ్రామిక్ రైళ్లలో వారిని సొంత రాష్ట్రాలకి తరలించారు.