Begin typing your search above and press return to search.
కరోనాను జయించిన 110 ఏళ్ల వృద్ధుడు!
By: Tupaki Desk | 13 May 2021 5:06 AM GMTఉక్కు కండలు కలిగిన యువత నేలరాలుతున్న చోట.. బాడీ బిల్డర్లు కొవిడ్ తో పోరులో ఓడిపోతున్న చోట.. 110 సంవత్సరాల వృద్ధుడు కరోనాను మట్టి కరిపించాడు! ప్రాణాంతక మహమ్మారిని తుత్తునియలు చేశాడు! ఈ అద్భుత ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఇది ఖచ్చితంగా వైద్యశాస్త్రంలో మిరాకిల్ అనే అంటున్నారు వైద్యులు.
ఆయన పేరు రామానంద తీర్థ. హైదరాబాద్ లోని ఆశ్రమంలో ఉంటున్నాడు. కొవిడ్ బారిన పడిన తీర్థ.. ఏప్రిల్ 24న గాంధీ ఆసుపత్రిలో చేరాడు. ఇన్ని రోజులు చికిత్స తీసుకున్న ఆయన.. ప్రస్తుతం కొవిడ్ బారి నుంచి బయటపడ్డాడని వైద్యులు వెల్లడించారు.
తాజాగా.. చేసిన పరీక్షల్లో తీర్థకు నెగెటివ్ వచ్చినట్టు తెలిపారు. ‘‘రామానందతీర్థ ఇప్పుడు కొవిడ్ నుంచి కోలుకున్నాడు. ఆయన సంతృప్త స్థాయి 97 శాతానికి పెరిగింది.’’ అని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు తెలిపినట్టు సమాచారం. అయితే.. మరికొన్ని రోజులు ఆసుపత్రి జనరల్ వార్డులో ఆయన పరిశీలనలో ఉంటాడని వైద్యులు చెప్పినట్టు తెలుస్తోంది.
కాగా.. తీర్థకు నా అన్నవాళ్లు ఎవరూ లేరు. హైదరాబాద్ సమీపంలోని కీసర వద్ద ఒక ఆశ్రమంలో ఒంటరిగా నివసిస్తున్నాడు. 110 ఏళ్ల వ్యక్తి కొవిడ్ -19 ను జయించడం అద్భుతమైన ఘట్టంగా చెబుతున్నారు. తద్వారా.. భయంకరమైన వైరస్ నుండి కోలుకున్న వృద్ధులలో ఒకరిగా తీర్థ నిలిచాడని వైద్యులు చెబుతున్నారు.