Begin typing your search above and press return to search.
ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే నాన్ స్టాప్ గా 1100కి.మీ.. భారత్ లోకి వచ్చేస్తోంది
By: Tupaki Desk | 7 Oct 2021 3:18 AM GMTఇప్పుడు అందరి చూపు ఎలక్ట్రికల్ కార్ల మీదే పడుతోంది. సంప్రదాయ ఇంధన వాహనాల్ని ఉపయోగించే రోజులు ఇక అయిపోయినట్లే. పెట్రోల్.. డీజిల్ ధరలు లీటరు వందను టచ్ చేయటంతో పాటు.. అంతకంతకూ పెరగటం ఒక ఎత్తు అయితే.. కాలుష్యాన్ని విపరీతంగా తగ్గించే విద్యుత్ కార్ల మీద ఇప్పుడు అందరి ఫోకస్ పడింది. ఇలాంటివేళ.. ఎలక్ట్రిక్ కారు అన్నంతనే గుర్తుకు వచ్చేది ‘టెస్లా’. ఖరీదైన.. విలాసవంతమైన.. స్టైలిష్ లుక్ తో ఇట్టే కట్టి పడేసే టెస్లాను భారత్ లోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇలాంటివేళ.. టెస్లా అమ్మ మొగుడు లాంటి మరో కార్ల సంస్థ ఇండియాలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది.త్వరలోనే భారత్ మార్కెట్లోకి సందడి చేయనున్న ఈ అమెరికన్ కార్ల కంపెనీ పేరు ట్రిటాన్. ఈ కంపెనీకి చెందిన ఎస్ యూవీని త్వరలోనే ఇండియాలో ఉత్పత్తి చేసి విడుదల చేయనున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే వారంలో ఈ ట్రిటాన్ ఎస్ యూవీ విడుదల కానుంది. తాజాగా ఈ కారుకు సంబంధించిన వివరాల్నికంపెనీ షేర్ చేసుకుంది.
అమెరికన్ కంపెనీఅయిన ట్రిటాన్.. టెస్లాకు పెద్ద ఎత్తున పోటీ ఇస్తోంది. త్వరలోనే ట్రిటాన్ ఐపీవోకు వెళ్లాలన్న ప్లాన్ లో ఉంది. టెస్లాకు గట్టి పోటీ ఇస్తున్న ఈ కార్ల కంపెనీ.. విడుదల చేసే కార్ల ఫీచర్లు చూస్తే.. పోటీ వాహనాలతో పోలిస్తే.. కారు విశాలంగా ఉండేలా తయారుచేశారు. ఈ సంస్థ వ్యవస్థాపకుడు హిమాన్షు పటేల్ తమ కారు ఫీచర్లను ఆసక్తికరంగా వివరిస్తున్నారు. ఈ కారు 1500 హార్స్ పవర్ ను ఉత్పత్తి చేస్తుందని.. ఈ కారులో 200kWh బ్యాటరీను అమర్చారు. దీంతో.. ఒకసారి ఛార్జి చేస్తే గరిష్ఠంగా 1120కి.మీ. ప్రయాణం చేయొచ్చని చెబుతున్నారు.
రెండు గంటల పాటు ఛార్జింగ్ పెడితే.. ఇంత దూరం ప్రయాణించే వీలుందని చెబుతున్నారు. పికప్ విషయంలోనూ ఎలాంటి సందేహం అక్కర్లేదని.. 0-96 కి.మీ. వేగాన్ని కేవలం 2.9సెకన్ల వ్యవధిలోనే అందుకుంటుందని వెల్లడించారు. మహారాష్ట్రలోని ఫూణెలో ఈ కంపెనీకార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసంది. మొదటి ఆర్నెల్లలో వంద కార్లను తయారుచేస్తారు. భారత్ లో వెయ్యి కార్ల కోసం అడ్వాన్స్ బుకింగ్ సురూ చేశారు. అమెరికాలోరూ.1.05 కోట్లుగా ఉన్న ఈ కారును భారత్ లో మరింత తక్కువ ధరకు అమ్మాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. చూస్తుంటే.. టెస్లాకు మాంచి పోటీ ఇచ్చేట్లుగా అనిపించట్లేదు?