Begin typing your search above and press return to search.
ఒకే గదిలో 114 కంపెనీలు...వైరల్!
By: Tupaki Desk | 25 July 2018 4:53 PM GMTనగరం నడిబొడ్డులో రద్దీగా ఉంటే షాపింగ్ కాంప్లెక్స్.....10 అంతస్తుల ఆ భవనంలోని నాలుగో అంతస్తులో ఓ కార్పొరేట్ ఆఫీసు...అంతకు ముందు నాలుగు నెలలు ఆ ఆఫీసులో పని చేసిన వ్యక్తికి ఐదో నెలలో షాక్....అక్కడ ఆ ఆఫీసు ఆనవాళ్లే లేకుండా బోర్డు తిప్పేసిన షెల్ కంపెనీ...ఇదంతా ఓ తమిళ సినిమాలో జరిగిన సీన్. దాదాపుగా ఇదే తరహాలో ఓ ఘటన హైదరాబాద్ లో రిపీట్ అయింది. అయితే, అక్కడ ఆఫీసు యథాతధంగా అలాగే ఉంది. కానీ, ఒకే ఆఫీసులో ఒక కంపెనీకి బదులుగా.....ఏకంగా 114 కంపెనీలు నడుపుతుండడంతో ...తనిఖీలకు వచ్చిన అధికారులు అవాక్కయ్యారు. ఆ 114 కంపెనీలలో 50 కంపెనీలు ఎటువంటి లావాదేవీలు నడపకుండానే పేపర్లపై కంపెనీకి క్రియేట్ చేయడంతో అధికారుల షాకయ్యారు. సినీ ఫక్కీలో నడుపుతోన్న ఈ ఉత్తుత్తి ఆఫీసుల ఘగన భాగ్యనగరంలో కలకలం రేపింది.
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని ఓ మాల్ లో ఒకే గదిలో 114 కంపెనీలు తమ కార్యాకలాపాలను సాగిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఆ మాల్ లోని ఓ చిరునామా కోసం వెళ్లిన 8 మంది అధికారుల బృందం అవాక్కయింది. 114 కంపెనీలకు ఆ చిన్న గదే చిరునామా అని తెలిసిన అధికారులు షాకయ్యారు. వాటిలో కనీసం 50 కంపెనీలు వ్యాపారం లేకుండానే రూ 8 కోట్ల నుంచి రూ 15 కోట్ల నష్టం చూపడం విశేషం. కంపెనీల మధ్య నగదు సరఫరా చేసేందుకే ఈ షెల్ కంపెనీలు పుట్టుకొచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే, ఆ పేపర్ కంపెనీలకు వ్యవసాయ భూములు, ఐటీ రిటన్స్ కూడా ఉండడం కొసమెరుపు. దాంతోపాటు ఈ కంపెనీల డైరెక్టర్లు దర్జాగా వేతనాలు కూడా అందుకోవడం గమనార్హం. రమారమి ఒక్కో డైరెక్టర్ 25 నుంచి 30 కంపెనీలను నిర్వహించడం ఈ ఎపిసోడ్ కే హైలైట్. ఒక వ్యక్తి 20 కంపెనీలకు మించి డైరెక్టర్ గా వ్యవహరించకూడదన్న నిబంధనలను వారు తుంగలో తొక్కినట్లు అధికారులు చెబుతున్నారు. ఒకే చిరునామాపై 25కి మించి కంపెనీలు నడిచే ప్రాంతాలపై నిఘా పెట్టాలన్న ఆదేశాలతోనే అధికారులు ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది.