Begin typing your search above and press return to search.

ఆ సీఎం ఆప‌రేష‌న్ క్లీన్ లెక్క వింటే షాకే

By:  Tupaki Desk   |   6 Feb 2018 6:29 AM GMT
ఆ సీఎం ఆప‌రేష‌న్ క్లీన్ లెక్క వింటే షాకే
X
యోగులు ఎలా ఉంటారు? శాంతిమంత్రాన్ని ఆల‌పిస్తూ.. మంచి మాట‌ల‌తో అంద‌రిని మార్చే ప్ర‌య‌త్నం చేస్తారు. మ‌రి.. అలాంటి యోగి ఒక‌రు రాజ‌కీయ నాయ‌కుడిగా అవ‌తారం ఎత్తితే..? పేరులోనే యోగి.. ఆపై స‌న్యాసి అయిన ఆయ‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లాంటి అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అయితే పాల‌న ఎలా ఉంటుంద‌న్న విష‌యంపై ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చిన నివేదిక ఒక‌టి ఆందోళ‌క క‌లిగించేలా ఉంది.

శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించే నేర‌స్తుల‌పై ఎన్ కౌంట‌ర్ అస్త్రాన్ని సంధిస్తున్న యోగి పాల‌న‌లో గ‌డిచిన ప‌ది నెల‌ల వ్య‌వ‌ధిలో ఎన్ని ఎన్ కౌంట‌ర్లు చోటు చేసుకున్నాయో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. 2018 జన‌వ‌రి 31 నుంచి యూపీలో చోటు చేసుకున్న ఎన్ కౌంట‌ర్లు అక్ష‌రాల 1142గా తేల్చారు. గ‌డిచిన 10 నెల‌ల్లో 2774 నేర‌స్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆప‌రేష‌న్ క్లీన్ పేరుతో భారీగా చేప‌ట్టిన ఈ ఆప‌రేష‌న్లో న‌లుగురు పోలీస్ సిబ్బంది మ‌ర‌ణించ‌గా.. 247 మంది గాయ‌ప‌డ్డారు. ఇక‌.. 34 మంది నేర‌స్తులు ఎన్ కౌంట‌ర్ లో హ‌త‌మ‌య్యారు. నేర‌స్తుల్ని ఏరివేయ‌టానికి యూపీ పోలీసుల‌కు పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చిన యోగి పుణ్య‌మా అని భారీ ఎత్తున ఎన్ కౌంట‌ర్లు చోటు చేసుకున్న‌ట్లుగా అధికారిక నివేదిక వెల్ల‌డిస్తోంది.

లొంగిపోండి.. లేదంటే రాష్ట్రం విడిచి వెళ్లిపోండన్న ట్యాగ్ లైన్ తో మొద‌లెట్టిన ఎన్ కౌంట‌ర్ల ప‌ర్వంలో మీర‌ట్ జోన్లో అత్య‌ధికంగా 449 ఎన్ కౌంట‌ర్లు జ‌ర‌గ్గా.. అగ్రాలో 210.. బ‌రేలీలో 196.. కాన్పూరులో 90 జ‌రిగాయి. అదే స‌మ‌యంలో సీఎం యోగి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గోర‌ఖ్ పూర్ జోన్లో అతి త‌క్కువ‌గా 31 ఎన్ కౌంట‌ర్లు జ‌రిగిన‌ట్లుగా వెల్ల‌డైంది. నేరాల్ని అరిక‌ట్ట‌టానికి 167 మంది క్రిమిన‌ల్స్ పై జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టం కింద కేసు న‌మోదు చేయ‌టంతో పాటు రూ.150 కోట్ల విలువైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఎన్ కౌంట‌ర్ ముసుగులో సామాన్యుల్ని పోలీసుల్ని కాల్చి చంప‌టంపై యూపీలో ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.