Begin typing your search above and press return to search.

రెండు రోజుల్లో 12 కుక్కలు మృతి ..కారణం ఏంటంటే ?

By:  Tupaki Desk   |   9 April 2020 2:30 AM GMT
రెండు రోజుల్లో 12 కుక్కలు మృతి ..కారణం ఏంటంటే ?
X
కరోనా వైరస్ ఒకవైపు రాష్ట్రంలో విలయతాండవం చేస్తున్న సమయంలో ...మరోవైపు పక్షలకు - జంతువులకు ఏవో తెలియని వింత రోగాలు వచ్చి కుప్పలుగా చనిపోతున్నాయి. మొన్నటికి మొన్న వేలల్లో కోళ్లు చనిపోయి పౌల్ట్రీ యజమానులకు నష్టం కలిగించింది. ఆ తరువాత నిన్న కాకులను ఏదో తెలియని వింత రోగం వచ్చి అవి కూడా అకస్మాత్తుగా కుప్పకూలాయి. ఇప్పుడు ఇదే నేపథ్యంలో శునకాలకు వింత రోగం వచ్చి ఉన్న చోటే చని పోతున్నాయి. కరోనా భయంతో ఇప్పటికే ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్న ప్రజలు మరింత భయబ్రాంతులకు గురవుతున్నారు.

పూర్తివివరాల్లోకి వెళ్తే ... తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపెల్లి జిల్లా ఓడేడ్‌ గ్రామంలో వీధి కుక్కలు ఎక్కడిక్కడే కుప్పకూలుతున్నాయి. ఏదో తెలియని వింత జబ్బులతో రెండు రోజలు వ్యవధిలోనే దాదాపుగా 12 కుక్కలు ఉన్నట్టుండి చనిపోయాయి. దీంతో గ్రామస్తులంతా భయాందోళనకు గురవుతున్నారు. ఈవిషయం పై పశు వైధ్యాధికారి హన్నన్‌ను వివరణ కోరగా గ్రామంలో కుక్కలు మృతి చెందాయని తమ దృష్టికి వచ్చిందని మూడు రోజుల క్రితం సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణంను పిచికారి చేయడంతో గ్రామంలోని గడ్డిని తిని ఇలా చనిపోయి ఉంటాయని అన్నారు. మళ్లీ కుక్కలు చనిపోతే పోస్ట్‌ మార్టం చేస్తామని తెలిపారు.

అలాగే గ్రామాల్లో కుక్కలకు సరైన ఆహారం దొరకకుండా చనిపోయి ఉంటాయని, గ్రామస్తులు భయ బ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు. గ్రామస్తులు భయ బ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఇక ఈ మధ్య కాలంలో అమెరికాలోని బ్లాంక్‌ జూలో పులికి కరోనా వ్యాధి వచ్చిందని వార్తలు రావడంతో అదే విధంగా కుక్కలకు కూడా ఏదైనా వింత రోగం వచ్చిందేమో అని ఆందోళన చెందుతున్నారు.