Begin typing your search above and press return to search.

నిజాం కాలం నాటి 12 కిలోల గోల్డ్ కాయిన్‌.. ఇప్పుడెక్కడ ఉంది?

By:  Tupaki Desk   |   3 July 2022 7:31 AM GMT
నిజాం కాలం నాటి 12 కిలోల గోల్డ్ కాయిన్‌.. ఇప్పుడెక్కడ ఉంది?
X
మొఘల్ సామాజ్ర్యాధినేత జహంగీర్‌కు కళలంటే మక్కువ. ప్రముఖులకు బహుమానాలు ఇవ్వాలంటే ఆయన ప్రత్యేకంగా కానుకలు తయారు చేసేవారు. అలా తయారు చేసిన వాటిలో నాణేలు ముఖ్యమైనవి. అందులోనూ 12 కిలోల బరువైన బంగారు నాణెం జహంగీర్ కాలంలోనే కాదు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. అసలిప్పుడు జహంగీర్, బంగారు నాణెం గురించి చర్చ ఎందుకంటారా..? ఎందుకో తెలుసుకోండి మరి..

గత కొన్నిరోజుల క్రితం హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో ప్రాచీన నాణేల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో చాలా మందిని ఆకర్షించిన నాణెం 12 కిలోల బరువైన గోల్డ్ కాయిన్. ఒకప్పుడు ఈ కాయిన్ నిజాం రాజుల వద్ద ఉండేదని సమాచారం. ఈ ప్రదర్శనను సందర్శించిన ప్రొఫెసర్‌ సల్మా ఫారుఖీని ఈ గోల్డ్ కాయిన్ బాగా ఆకర్షించింది. దీని గురించి మరింత తెలుసుకోవడానికి నాణెం గురించి ఆమె పరిశోధనలు మొదలుపెట్టారు.

ప్రొఫెసర్ సల్మా ఫారుఖీ ప్రస్తుతం హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో హెచ్‌.కె. షేర్వాని సెంటర్‌లో డక్కన్ స్టడీస్ విభాగంలో డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె ఈ గోల్డ్ కాయిన్ గురించి తెలుసుకున్న కొన్ని విషయాలను మనతో పంచుకున్నారు.

''మొఘల్ చక్రవర్తి జహంగీర్‌కు కళలంటే మక్కువ ఎక్కువ. ఆయన ఎవరికైనా బహుమతి ఇవ్వాలంటే ఆయనే ప్రత్యేకంగా తయారు చేసేవారు. అందుకోసం ఆయన ఎక్కువగా బంగారు నాణేలు రూపొందించేవారు. అలా ఆయన తయారు చేసిన నాణేలలో 12 కిలోల గోల్డ్ కాయిన్ చాలా ప్రత్యేకమైనది. పార్శీ భాష అంటే ఆయనకు ఎక్కువ మక్కువ. అందుకే ఆ నాణేలపై కూడా పార్శీ భాష కనిపించేది. ఈ నాణెం బరువు 11 కిలోల 193 గ్రాములు'' అంటూ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నాణెం గురించి వివరించారు ప్రొఫెసర్ సల్మా ఫారూఖీ.

ఇప్పుడు చర్చలోకి వచ్చిన వెయ్యి మొహర్ల నాణేన్ని కౌకాబ్-ఏ-తాలి అని పిలిచేవారు. అంటే "ది రైజింగ్ స్టార్" అని అర్థం. దీని ప్రత్యేకత దాని బరువే. ఇదే పేరుతో అప్పట్లో 500, 200, 100 మొహర్ల నాణేలు కూడా చేయించారు. వీటిలో బంగారం, వెండి కూడా ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

ఈ నాణేన్ని జహంగీర్ మనవడు, షాజహాన్ కొడుకు ఔరంగజేబు.. మొదటి నిజాం రాజు తండ్రికి ఇచ్చారనేది ఎక్కువ మంది చరిత్రకారుల అ‌‍భిప్రాయం. ఈ రెండిటిలో ఒకటి ప్రస్తుతం కువైట్‌లోని ఇస్లామిక్ మ్యూజియంలో ఉంది. బహుశా అదే ఇరాన్ రాయబారికి ఇచ్చిన కానుక అని చాలామంది చరిత్రకారులు చెబుతారు. కానీ నిర్ధారణ లేదు.

ఆఖరి నిజాం మనుమడు అయిన ముఖరంజా దానిని తీసుకొని స్విట్జర్లాండ్ దేశం జెనీవాలోని ఒక బ్యాంకులో పెట్టారు. తరువాత అది వేలంలో అమ్ముడుపోయి ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్టు చరిత్రకారులు సఫీయుల్లా చెబుతున్నారు.

వాస్తవానికి 100 ఏళ్ల కు పై బడిన ఎలాంటి పురాతన వస్తువును అయినా అమ్మడం, కొనడం లేక విదేశాలకు పంపడం..యాంటిక్విటీ అండ్ ఆర్ట్ ట్రెజరర్స్ చట్టం ప్రకారం చట్ట విరుద్ధం. అయితే ఈ నాణెం భారత ప్రభుత్వం దగ్గర కాకుండా, నిజాం రాజు వారసుడి దగ్గర ఉండటంతో అది ప్రభుత్వ ఆస్తి అని నిరూపించలేక పోయింది భారతదేశం. దాంతో ఆ నాణెం తిరిగి అమెరికా నుంచి భారత్ రప్పించడం చట్టపరంగా అసాధ్యమనీ, భారత్ కావాలంటే దాన్ని తిరిగి కావాలని చరిత్రకారుల అభిప్రాయం.