Begin typing your search above and press return to search.
పేద బతుకుల్ని పేల్చేసిన కర్నూలు విషాదం
By: Tupaki Desk | 4 Aug 2018 4:00 AM GMTఈ మధ్యన హైదరాబాద్ మహానగరంలోని సైబరాబాద్ పరిధిలోని కొన్ని కిలోమీటర్ల మేర సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం రెండు క్షణాల పాటు వినిపించి ఏమైందో అర్థం కాని క్వశ్చన్ మార్క్ నగర జీవులకు కలిగేలా చేసింది. కాసేపటికే ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఒక నిర్మాణం కోసం రాతిని పేల్చేందుకు తెప్పించిన భారీ జిలెటిన్ స్టిక్స్ ను దింపుతుండగా కలిగిన ఒత్తిడికి అవి పేలిపోవటం.. అప్పటికే అక్కడి కూలీలు వెళ్లిపోవటంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
దాదాపుగా ఇలాంటి ఉదంతమే తాజాగా కర్నూలు జిల్లాలోని ఆలూరు మండలంలో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఉదంతంలో 12 మంది పేద కూలీలు ప్రాణాలు కోల్పోయారారు. భారీ ఎత్తున పేలుడు చోటు చేసుకోవటంతో పాటు.. పెద్ద ఎత్తున మంటలు ఒక్కసారి ఎగిసిపడటంతో అక్కడికి సమీపంలో ఉన్న కూలీలు మృత్యువాత పడ్డారు.
ఇంత భారీ ప్రమాదం ఎలా జరిగింది? దీనికి కారణం ఏమిటి? అన్నది చూస్తే.. హత్తిబెళగల్ సమీపంలోని చౌదరి కనెస్ట్రక్షన్స్ కు క్వారీ ఉంది. దానికి జతగా కంకర క్రషర్స్ ఉన్నాయి. ఇందులో 30 మంది కూలీలు పని చేస్తుంటారు. వారంతా ఒడిశాకు చెందిన వారిగా చెబుతున్నారు. వారంతా షిఫ్ట్ ల వారీగా పని చేస్తూ.. సమీప గ్రామాల్లో ఉంటున్నారు. శుక్రవారం రాత్రి పనిలో ఉన్న సమయంలో పని ప్రాంతానికి దగ్గరగా ఉంచిన జిలెటిన్ స్టిక్స్ పెద్ద శబ్దంతో పేలిపోయాయి.
జిలెటిన్ స్టిక్స్ కు ఉంచిన ప్రాంతానికి దగ్గర్లో వంట చేయటం.. ఆ వేడికి పేలుడు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ పేలుడు ప్రభావానికి కొన్ని కిలోమీటర్ల మేర భూమి కంపించటంతో పాటు.. భారీ శబ్దాలకు చుట్టు పక్కల గ్రామాల వారు భయాందోళనలకు గురయ్యారు. పేలుడు ధాటికి అక్కడే ఉన్న పలువురి కూలీల శరీర భాగాలు తునాతునకలు కావటమే కాదు.. మరికొందరు తీవ్ర గాయాలకు గురయ్యారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితులకు తగిన చర్యలు చేపట్టారు.
క్వారీకి సమీపంలో ఉన్న హత్తిబెళగల్.. అగ్రహారం.. కురవల్లి.. ఆలూరు.. మొలగవల్లి గ్రామాల్లోని ఇళ్లు పూర్తిగా దెబ్బ తిన్నాయి. పేలుళ్లకు కారణం ఏమిటి? ఇందుకు బాధ్యులుఎవరు? అన్న దానిపై ఎవరూ పెదవి విప్పటం లేదు. ప్రమాదంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి దిగ్బాంత్రి వ్యక్తం చేశారు. ఇక.. ఈ పరమాదంపై విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. క్వారీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.