Begin typing your search above and press return to search.
ప్రపంచవ్యాప్తంగా 12.76 లక్షల కేసులు.. 69వేల మృతులు
By: Tupaki Desk | 6 April 2020 5:15 AM GMTప్రపంచవ్యాప్తంగా కరోనా మృత్యుఘెష ఆగడం లేదు. మొత్తం 205 దేశాలకు ఈ మహమ్మారి పాకింది. ఇప్పటికే వేలాది మందిని పొట్టనపెట్టుకుంది. కొన్ని లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు.యూరప్ లో మరణమృదంగం వాయిస్తోంది.
కరోనాకు ఎలా అడ్డుకట్ట వేయాలో.. ఎలా అరికట్టాలో తెలియక దేశాలు సతమతమవుతున్నాయి. దీనికి మందు లేక పోవడంతో వ్యాక్సిన్ తయారీకి ప్రయత్నాలు చేస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 12.76 లక్షలకు దాటింది. గడిచిన 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 4900మంది చనిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా 69400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ లోనే 48000 మంది చనిపోయారు. ఈ నాలుగు దేశాల్లోనే 8 లక్షల మంది ఇప్పటి వరకు వైరస్ బారిన పడ్డారు.
చైనాలో తాజాగా మరో 39 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో చైనాలో కేసుల సంఖ్య 81708కి చేరింది. ఇటలీలో మరణాలు 15వేలు దాటాయి. ఇటలీని కేసుల్లో స్పెయిన్ అధిగమించింది. ఏకంగా ఆ దేశంలో1.31 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 12వేల మంది చనిపోయారు. బ్రిటన్ లో 47వేల మందికి కరోనా సోకగా.. ఆదివారం ఒక్కరోజే 621 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 5914కు చేరింది.
అమెరికాలోని న్యూయార్క్ శవాల దిబ్బగా మారుతోంది. కరోనాకు బలి అవుతున్న వారితో మార్చురీలు కూడా నిండిపోతున్న దైన్యం కనిపిస్తోంది. న్యూయార్క్ లో 24 గంటల్లోనే 630మంది చనిపోయారు. తర్వాత న్యూజెర్సీ ఉంది. అమెరికా మొత్తంలో 3.36 లక్షలమంది వైరస్ బారిన పడగా.. 9616మంది చనిపోయారు.
ఫ్రాన్స్‌లో 8,073 మంది, ఇరాన్‌లో 3, 603 మంది, బ్రిటన్‌లో 4,934 మంది, జర్మనీలో 1,584 మంది, బెల్జియంలో 1,447 మంది, నెదర్లాండ్‌లో 1,766, స్విట్జర్లాండ్ 715, టర్కీ 574, కెనాడా 284 మంది మృతిచెందారు.
*భారత్ లో పెరుగుతున్నకరోనా కేసులు
భారత్ లోనూ కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకు కొత్త కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే మరో 600కు పైగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. దీంతో ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4200 దాటింది. వారం రోజుల్లోనే దేశంలో 3000కు పైగా కేసులు నమోదు కావడం విశేషం. మహారాష్ట్రలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బారిన పడి 27మంది చనిపోయారు.
*ఏపీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో కేసులు 50 దాటిపోయాయి. ఒక్కరోజులో 52 పాజిటివ్ కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది. ఇందులో ఢిల్లీ వెళ్లివచ్చిన వారే ఎక్కువమంది ఉన్నారు.దీంతో అక్కడ రెడ్ , బఫర్ జోన్లుగా ప్రకటించారు. ఏపీలో కొత్తగా 69 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసులసంఖ్య 258కి చేరింది. ఏపీలో ఐదుగురు కోలుకున్నారు.
*తెలంగాణలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే తెలంగాణ లో 62 కొత్త కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లోనే 145కేసులను గుర్తించారు. తర్వాత వరంగల్ లో నమోదయ్యాయి. తెలంగాణ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 332కి చేరింది. ఇప్పటివరకు తెలంగాణ లో 34 మంది కోలుకోగా.. 11 మంది మరణించారు.