Begin typing your search above and press return to search.

పిల్లాడి ప్రాణాలు తీసిన కార్క్ బాల్..

By:  Tupaki Desk   |   18 Jan 2020 5:50 AM GMT
పిల్లాడి ప్రాణాలు తీసిన కార్క్ బాల్..
X
విన్నంతనే జీర్ణించుకోలేని వాస్తవంగా దీన్ని చెప్పాలి. క్రికెట్ అంటే విపరీతమైన మోజున్న ఒక కుర్రాడి ప్రాణాల్ని క్రికెట్ బాల్ ప్రాణం తీసిన వైనం సంచలనంగా మారింది. కర్నూలు జిల్లా ఆదోనిలో చోటు చేసుకున్న ఈ విషాదం పలువురిని కలిచివేస్తోంది. పన్నెండేళ్ల మొయినుద్దీన్ కు క్రికెట్ అంటే చాలా ఇష్టం.

స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు మసీదుపుర మైదానానికి వెళ్లాడు. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడిన అతను తీవ్రంగా అలిసిపోయాడు. దీంతో తాను కాసేపు రెస్టు తీసుకుంటానని.. గ్రౌండ్ లో ఒకచోట కూర్చొని సేద తీరాడు. అదే సమయంలో అనూహ్యంగా క్రికెట్ బంతి వేగంగా వచ్చి అతగాడి ఛాతీని తాకింది. దీంతో.. అక్కడికక్కడే కుప్పకూలాడు.

దీన్ని గమనించిన అక్కడి పిల్లలు ఏమైందంటూ అక్కడకు పరుగున వచ్చారు. మంచినీళ్లు ఇస్తే తాగలేదు. హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలుడ్ని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ప్రాణాలు పోయినట్లుగా నిర్దారించారు. క్రికెట్ బంతి ఛాతీ భాగంలో బలంగా తగలటం.. అప్పటిక పిల్లాడు తీవ్రంగా అలిసిపోయి ఉండటంతో ఊపిరి ఆగినట్లుగా వైద్యులు వెల్లడించారు. మొయినుద్దీన్ తండ్రి టైలర్ గా పని చేస్తుంటాడు. ఆరో తరగతి చదివే ఈ కుర్రాడు క్రికెట్ బంతి తగిలి చనిపోవటం స్థానికంగా అందరి కంటా కన్నీరు తెప్పిస్తోంది.