Begin typing your search above and press return to search.

ఘోరం : గ్రామ స‌చివాల‌యంలోనే 12 ఏళ్ల బాలిక‌పై అఘాయిత్యం !

By:  Tupaki Desk   |   6 Nov 2021 7:07 AM GMT
ఘోరం : గ్రామ స‌చివాల‌యంలోనే 12 ఏళ్ల బాలిక‌పై అఘాయిత్యం !
X
అమ్మాయిల , మహిళల రక్షణ కోసం రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని కొత్త చట్టాలు తీసుకొస్తున్నా కూడా మహిళలపై జరిగే అఘాయిత్యాలు మాత్రం తగ్గడం లేదు. ఎంతమంది పోలీసులు , ఎన్ని చట్టాలు ఉన్నా కూడా అవి గొప్పలు చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికి రావడం లేదు. ప్ర‌తి నిత్యం ఏదో ఒక చోట మ‌హిళ‌ల‌పై దారుణాల‌కు పాల్ప‌డుతూనే ఉన్నారు. కామంతో క‌ళ్లు మూసుకుపోయిన కామంధులు దారుణాల‌కు తెగ‌బ‌డుతున్నారు. తాజాగా.. ఓ వాలంటీర్‌ దుర్మార్గానికి తెర లేపాడు. ఏకంగా గ్రామ సచివాలయంలోనే బాలిక పై వాలంటీర్‌ లైంగిక దాడి చేశాడు. శ్రీకాకుళం జిల్లాలో జ‌రిగిన ఈ అమానుష‌ ఘ‌టన ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. వీర‌ఘ‌ట్టం మండ‌లం న‌డుకూరు స‌చివాల‌యంలో బొత్స హ‌రిప్ర‌సాద్ వాలంటీరుగా ప‌నిచేస్తున్నాడు. గఅక్టోబ‌ర్ 31 న ఓ బాలిక‌కు మాయ మాట‌లు చెప్పి స‌చివాల‌యంలోకి తీసుకువ‌చ్చాడు. అక్క‌డే తాత్కాలిక ఉద్యోగిగా ప‌నిచేస్తున్న రాంబాబు, హ‌రిప్రసాద్‌ కు స‌హ‌క‌రించాడు. అత‌డు బ‌య‌ట‌కు వ‌చ్చి త‌లుపులు మూసి తాళం వేసి బ‌య‌ట ఉన్నాడు. హ‌రిప్ర‌సాద్ బాలిక‌పై అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాడు. బాలిక అప‌స్మార‌స్థితిలోకి వెళ్లిపోయింది. కొద్ది సేప‌టి త‌రువాత తేరుకున్న బాలిక ఇంటికి వెళ్లిపోయింది. ఈ ఘటన జరిగిన రోజు ఆమె కుటుంబ సభ్యులు ఊర్లో లేరు. కుటుంబసభ్యులు వచ్చేసరికి అనారోగ్యానికి గురైన బాలకని చూసి బాధితురాలి సోద‌రికి అనుమానం వ‌చ్చి ఆరా తీయ‌గా.. అస‌లు విష‌యాన్ని చెప్పింది.

ఆదివారం రోజున సచివాలయం మూసివేయాలి. కానీ వాలంటీర్లు సెలవు రోజున కూడా ఓపెన్ చేసి ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని గ్రామస్తులు ఆరోపించారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, బాధితురాలిని స్థానిక నేతలు పరామర్శించారు. మరోవైపు వాలంటీర్లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించినట్లు వెల్లడించారు.