Begin typing your search above and press return to search.

ఐన్ స్టీన్ క‌న్నా ఈ అమ్మాయికే ఎక్కువ‌

By:  Tupaki Desk   |   7 May 2017 4:06 AM GMT
ఐన్ స్టీన్ క‌న్నా ఈ అమ్మాయికే ఎక్కువ‌
X
ప్రపంచ చ‌రిత్ర‌లో అత్యంత మేధావి ఎవ్వ‌రంటే ముందు అంద‌రికీ గుర్తుకొచ్చే పేరు ఆల్బ‌ర్ట్ ఐన్ స్టీన్ దే. ఆయ‌న ఘ‌న‌తల గురించి.. ఆయ‌న సాధించిన విజ‌యాల గురించి... ఆయ‌న ఐక్యూ గురించి క‌థ‌లు క‌థ‌లుగా చెప్ప‌కుంటారు. అలాంటి మేధావి కంటే ఎక్కువ ఐక్యూ క‌లిగి ఉండి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది భార‌త సంత‌తికి చెందిన రాజ్‌ గౌరి పవార్ అనే అమ్మాయి. లండన్‌ లోని చెషైర్‌ కౌంటీలో నివసించే ప్రవాస భారతీయుడు డాక్టర్‌ సూరజ్‌ కుమార్‌ పవార్ కూతురైన రాజ్ గౌరి ప‌వార్‌.. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఐక్యూ పరీక్షల్లో ఏకంగా 162 పాయింట్లు సాధించింది. ఈ ఐక్యూ.. ఐన్ స్టీన్.. స్టీఫెన్ హాకింగ్ లాంటి మేధావుల ఐక్యూ క‌న్నా ఎక్కువ కావ‌డం విశేషం.

18 ఏళ్లలోపు వారికి నిర్వహించే ఐక్యూ పరీక్షలో రాజ్‌ గౌరి పాల్గొని అంద‌రిలోకి అత్యధికంగా పాయింట్లు తెచ్చుకుంది. మామూలుగా 140 ఐక్యూ పాయింట్లు వ‌స్తేనే మేధావిగా ప‌రిగ‌ణిస్తారు. అలాంటిది 162 పాయింట్లు వ‌చ్చాయంటే రాజ్ గౌరి మేధ‌స్సు ఎలాంటిదో అర్థం చేసుకోవ‌చ్చు. రాజ్ గౌరిని మెన్సా అనే సంస్థ తమ బ్రిటిష్‌ మెన్సా ఐక్యూ సొసైటీ సభ్యురాలిగా చేర్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాక 20 వేల మందికి మాత్ర‌మే 140 పాయింట్ల‌కు పైగా ఐక్యూ ఉన్న‌ట్లు ఈ సంస్థ చెబుతోంది. రాజ్ గౌరి స్కూల్లో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే త‌మ కూతురు ఈ ఘ‌న‌త సాధించిన‌ట్లు ఆమె తండ్రి చెబుతున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/