Begin typing your search above and press return to search.

12 ఏళ్లు.. 40 సర్జరీలు..రూ.5 కోట్లు.. ఈమె మాములమ్మాయి కాదు..!

By:  Tupaki Desk   |   14 July 2022 7:30 AM GMT
12 ఏళ్లు.. 40 సర్జరీలు..రూ.5 కోట్లు.. ఈమె మాములమ్మాయి కాదు..!
X
'జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ది' అన్నారు పెద్దలు. ప్రపంచంలో ఏ ఇద్దరి భావాలు దాదాపు సమానంగా ఉండవు. ప్రతీ ఒక్కరిలో ప్రత్యేకమైన లక్షణాలు, కోరికలు, అలవాట్లు ఉంటాయి. అయితే వారికున్న కోరికలు మంచివే అయితే పర్వాలేదు. కానీ ఒక్కోసారి అవి వికటించి ప్రాణాల మీదకు తెస్తాయి. ఇలాగే ఓ మోడల్ కు ఓ కోరిక ఉండేది. ఎప్పటికైనా తాను అభిమానించే నటిగా మారాలని తాపత్రయపడేది. ఇందు కోసం చిన్నప్పటి నుంచే అందంగా ఉండాలని ప్రయత్నించేది.

అయితే ఇందులో భాగంగా ఆమె తన అభిమాన తార వలె మారడానికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది. అలా తన 12 ఏళ్ల జీవితంలో మొత్తం 40 సార్లు తన రూపాన్ని మార్చుకుంది. ఇందుకోసం రూ.5 కోట్లు ఖర్చు చేసింది. అయితే చివరికి ఆమె అనుకున్నట్లే సంతృప్తి చెందిందా..? చివరికి ఏం జరిగింది..?

బ్రెజిల్ కు చెందిన జెన్నిఫర్ పంప్లోనా మోడల్ గా కొనసాగారు. ఇటలీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ వెర్సేస్ కు అంబాసిడర్ గా ఉన్నారు. ఓ సమస్య ఉండేది. అదే డిస్ మార్ఫియా. అంటే అందం కోసం పదే పదే ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం.

జెన్నీఫర్ కు చిన్నప్పటి నుంచి అమెరికాకు చెందిన సెలబ్రెటీ కిమ్ కర్దాషియన్ అంటే విపరీతమైన అభిమానం. ఎప్పటికైనా ఆమెలా మారాలని కోరిక ఉండేది. దీంతో తన దేహాన్ని పదే పదే అద్దంలో చూసుకోవడం, లోపాల్ని వెతుక్కుంటూ మానసికంగా కుంగిపోయేది. దీంతో ఎలాగైనా అందంగా మారాలని ఇందుకోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకుంది.

జెన్నఫర్ తొలిసారి 17 ఏళ్ల వయసులో కాస్మొటిక్ సర్జరీ చేయించుకుంది. అయితే తాను అనుకున్న విధంగా అందంగా మారలేకపోయింది. దీంతో అప్పటి నుంచి ప్లాస్టిక్ సర్జరీపైనే దృష్టి పెట్టింది. ఈ క్రమంలో మూడు రినోప్లాస్టిస్, బట్ ఇంప్లాట్స్, బ్రెస్ట్ ఇంప్లాట్స్, ప్యాట్ ఇంజెక్షన్, లిప్ ఫిల్లర్స్ లాంటి మొత్తం 12 ఏళ్ల కాలంలో 40 సర్జరీలు చేయించుకుంది. వీటి కోసం మొత్తం రూ.5 కోట్లు ఖర్చు చేసింది. అయితే 40వ సర్జరీ తరువాత ఆమె అభిమాన తార కిమ్ కర్దాషియన్ లా మారిపోయింది. దీంతో ఆమెను కిమ్ చెల్లెలుగా కొనియాడారు. అయితే అప్పటికీ జెన్నిఫర్ తృప్తి పొందలేకపోయింది.

ప్రస్తుతం ఆమె చివరికి తన అసలు రూపంలోకి మారాలని అనుకుంటోంది. 'నా జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశా.. ఎన్నో విషయాల్లో సక్సెస్ అయ్యా.. మానసికంగా ఎంతో కుంగిపోయా.. సర్జరీలకు బానిసయ్యా.. నాకున్న డిస్ మార్పియా అలవాటే జీవితాన్ని నాశనం చేసింది..' అంటూ పశ్చాత్తపం చెందుతోంది. అయితే ప్రస్తుతం జెన్నిఫర్ తన అసలు రూపాన్ని మార్చుకోవడానికి ఇస్తంబుల్ లోని నిపుణుడిని సంప్రదించింది. అయితే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లి తిరిగి వస్తున్న ప్రతీసారి తన రూపాన్ని చూసుకున్న సమయంలో పునర్జన్మ ఎత్తినట్లయిందని అంటోంది.

అయితే జెన్నీఫర్ స్టోరీ చదివినా చాలా మంది ఇలాంటి పోకడకలు వెళ్లొద్దని సూచిస్తున్నారు. సినీ తారలపై అభిమానం ఉండాలి గానీ.. ఇలా వెర్రి తలలు వేసేలా ఉండొద్దని అంటున్నారు. మనదేశంలోనూ కొందరు ఇలాంటివి ప్రయత్నించి కొందరు సక్సెస్ కాగా.. మరికొందరు వికటించి ప్రాణాలు తీసుకున్నారు. బాలీవుడ్ నటీ ప్రియాంక లిప్స్, నోస్ సర్జరీ చేయించుకొని సక్సెస్ కాగా.. తెలుగు నటి ఆర్తి అగర్వాల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని వికటించడంతో ప్రాణాలు పోయాయి.