Begin typing your search above and press return to search.
26/11 మారణకాండకు ఈ రోజుతో 12 ఏళ్లు!!
By: Tupaki Desk | 26 Nov 2020 12:30 PM GMT26/11 ... ఈ డేట్ అంటేనే భారతదేశం మొత్తం భయంతో వణికిపోతోంది. ఈ ఉగ్రదాడికి నేటికి 12 ఏళ్లు పూర్తి అయ్యాయి. 2008లో నవంబర్ 26న ముంబైలో జరిగిన మారణహోమం 166 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ ఆర్థిక రాజధానిని తూటాల వర్షంతో చిన్నాభిన్నం చేసిన ఉగ్ర విధ్వంసం ఇంకా దేశ ప్రజలు కార్చిన కన్నీటికి సజీవ సాక్షంగా నిలుస్తోంది. నేటికి సరిగ్గా 12 కిత్రం ముంబైపై ఆధునిక ఆయుధాలతో విరుచుకుపడిన 12 మంది లష్కరే ఉగ్రమూకల బారిన పడి 166 మంది ప్రాణాలు కోల్పోతే.. 300 మందికి పైగా గాయపడ్డారు.
ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వేస్టేషన్ లో తొలి బుల్లెట్ ను పేల్చాడు అజ్మల్ కసబ్, ఆ తర్వాత కొద్దిసేపటికే నారీమన్ హౌస్ లో మరో బృందం కాల్పులకు తెగబడింది. ఇక్కడి ఇజ్రాయెలీల నివాస సముదాయమైన జూయిష్ చాబాద్ ను ఉగ్రవాదులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత, విదేశీ పర్యాటకులు, స్థానికులతో కిటకిటలాడే విలాసవంతమైన లెపార్డ్ కేఫ్ లోకి నలుగురు ఉగ్రవాదులు చొరబడి చెలరేగిపోయారు. 15 నిమిషాలపాటు అక్కడ తూటాలతో విధ్వంసం సృష్టించి సమీపంలోని తాజ్ హోటల్ లోకి చొరబడ్డారు. ముంబైలో ఉగ్రదాడికి పాల్పడ్డ కసబ్‌కు లష్కరే తోయిబా కరాచీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తేలింది.. ఇక, కసబ్‌కు శిక్ష విధించేందుకు జాదవ్ ముఖ్యమైన సాక్ష్యంగా మారారు. జడ్జీలకు పోలీసు వాహనంలో జరిగిన సంఘటనలను జాదవ్ పూసగుచ్చినట్లు వివరించారు. 2010, మేలో కసబ్‌కు మరణశిక్ష విధించారు. ఆ తర్వాత మరో రెండేళ్లకు పుణెలోని యెరవాడ జైలులో దానిని అమలు చేశారు.
ఈ ఉగ్ర దాడుల్లో అమరులైన భద్రతా సిబ్బందికి నివాళులర్పించే కార్యక్రమాన్ని నగర పోలీసులు నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలో ప్రజలను మాత్రమే అనుమతిస్తున్నట్లు , దక్షిణ ముంబైలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో కొత్తగా నిర్మించిన స్మారక చిహ్నంలో జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అమరులైన పోలీసు కుటుంబ సభ్యులు - భద్రతా సిబ్బంది హాజరవుతారని ,అలాగే రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ - సీఎం ఉద్ధవ్ ఠాక్రే - హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ - డీజీపీ సుభోధ్ కుమార్ జైస్వాల్ - ముంబై పోలీసు కమిషనర్ పరమ్ బిర్ సింగ్ ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.