Begin typing your search above and press return to search.

ఇరాన్ నుండి భారత్ కి 120 మంది భారతీయులు..నిర్బంధించనున్న కేంద్రం!

By:  Tupaki Desk   |   13 March 2020 7:07 AM GMT
ఇరాన్ నుండి భారత్ కి 120 మంది భారతీయులు..నిర్బంధించనున్న కేంద్రం!
X
కరోనా వైరస్ చాపకిందనీరులా ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది. చైనా లో మొదలైన మహమ్మారి ప్రస్తుతం 129 దేశాలకి పాకింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మృతుల సంఖ్య 4,972కి చేరింది. ఇక 1,34, 558 మంది కరోనా బాధితులు ఉన్నారు. కాగా , భారత్ లో కూడా ఈ వైరస్ తన పంజా విసురుతోంది. దేశంలో ఇప్పటికే 74 మందికి పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ కరోనా చైనా తరువాత అంతగా ప్రభావం చూపిస్తున్న దేశం ఏది అంటే ఇరాన్ - ఇటలీ.

దీనితో ఆ దేశాలలో ఉన్న 6 వేల మంది భారతీయు లను తరలించేందుకు భారత రాయబార కార్యాలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు భారత్ కి చేరుకోగా, మరో120 మంది శుక్రవారం భారత్ చేరుకోనున్నారు. ఇప్పటికే వారు ఎయిర్ ఇండియా విమానంలో భారత్ కి ప్రయాణం అయ్యారు అని ,అయితే , వారు ఇండియా కి చేరుకోగానే అందరిని జై సల్మీర్ ఐసోలేషన్ వార్డు లో రెండు వారాల పాటు నిర్భందిస్తామని అధికారులు తెలిపారు.

జై సల్మీర్ ఐసోలేషన్ వార్డు లో ఆ 120 మందికి స్క్రీనింగ్ చేసిన తర్వాతనే.. ఐసోలేషన్ వార్డుకు తరలిస్తామని రక్షణశాఖ అధికార ప్రతినిధి కల్నాల్ సోబిట్ ఘోష్ తెలిపారు. మరో 250 మందిని శనివారం ఇరాన్ నుంచి తరలిస్తామని.. వారిని కూడా జైసల్మీర్‌లో రెండువారాలు నిర్భందించిన తర్వాతనే వారి వారి స్వస్థలాలకు పంపిస్తామని ప్రకటించారు. కరోనా వైరస్ సోకిన వారి కోసం రక్షణశాఖ మరో ఏడు నిర్బంధ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని వివరించారు.

విదేశాల్లో వైరస్ ప్రబలిన వారిని ఇండియా తీసుకొచ్చి.. ఐసోలేషన్ వార్డు లో ఉంచుతామని.. వైరస్ తగ్గాక పంపిస్తామని చెప్పారు. జోద్‌ పూర్ - ఝాన్సీ - డియోలాలీ - కోల్‌ కతా -చెన్నై - సూరత్‌ గర్ - జైసల్మీర్‌ లో ఏర్పాట్లు చేశామన్నారు. ఒకవేళ అవసరమనుకుంటే మిలిటరీ ఆస్పత్రుల్లో కూడా తగిన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. అలాగే హిందాన్ - మనేసర్ మిలిటరీ క్యాంపుల్లో 265 మంది పౌరులకు తగిన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మొత్తంగా ఇరాన్‌ లో ఉన్న 6 వేల మంది భారతీయులలో 1100 మంది మహారాష్ర్ట, జమ్ముకశ్మీర్‌ కు చెందిన పర్యాటకులే అని చెప్పారు.