Begin typing your search above and press return to search.

దేశంలోనే హైదరాబాద్ లో భారీ అంబేద్కర్ విగ్రహం.. దీని విశిష్టత ఏంటి

By:  Tupaki Desk   |   13 April 2023 6:17 PM GMT
దేశంలోనే హైదరాబాద్ లో భారీ అంబేద్కర్ విగ్రహం.. దీని విశిష్టత ఏంటి
X
125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం హుస్సేన్ సాగర్ తీరాన కొలువు దీరింది. దీన్ని 2016 ఏప్రిల్ 14న పనులు ప్రారంభించారు. 125వ జయంతి సందర్భంగా ఆనాడు పనులు ప్రారంభించారు. ఇప్పుడు 132వ జయంతి సందర్భంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. భాగ్యనగరానికే శోభాయమా నంగా ఇది కనిపించనుంది. భారీ ఆకారంతో కనిపించే విగ్రహం అందరిని కనువిందు చేయనుంది. ఈ నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు అందరికి వేడుక కానుంది.

ట్యాంక్ బండ్ మీద ఇదివరకు బుద్ధ విగ్రహం, బిర్లా మందిర్, ఎన్టీఆర్ ఘాట్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం కన్నుల పండగగా మారనుంది. అంబేద్కర్ కాళ్ల కింద పార్లమెంట్ భవనం మీద అంబేద్కర్ నిలబడి ఉన్నట్లు విగ్రహం ఏర్పాటు చేశారు. దేశంలోనే ఎత్తయిన విగ్రహంగా దీన్ని 125 అడుగుల ఎత్తు, 45.5 అడుగుల వెడల్పుతో నిర్మించారు. దీని బరువు 465 టన్నులు ఉంి. 96 టన్నుల ఇత్తడి వాడారు.

విగ్రహానికి రూ. 146 కోట్లు ఖర్చు చేశారు. 791 టన్నుల స్టీల్ వాడారు. విగ్రహ పీఠం ఎత్తు 50 అడుగుల వెడల్పు పార్లమెంట్ ఆకారంలో నిర్మించబడింది. 11.04 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. 2.93 ఎకరాల్లో ధీమ్ పార్కు ఏర్పాటు చేశారు. పీఠం కింద ఒక గ్రంథాలయం, జ్ణాన మందిరం, అంబేద్కర్ జీవితంలోని ముఖ్య ఘట్టాల ఫొటో గ్యాలరీ నిర్మించారు.

గులాబీ, చామంతులు, తమలపాకులతో ప్రత్యేకంగా మాల తయారు చేయించి క్రేన్ సాయంతో వేయనున్నారు. విగ్రహావిష్కరణకు అంబేద్కర్ మునిమనవడు ప్రకాశ్ అంబేద్కర్ హాజరు కానున్నారు. విగ్రహాన్ని మహారాష్ట్రకు చెందిన రామ్ వంజీ సుతార్ రూపొందించారు. కేపీసీ కంపెనీ కాంట్రాక్టు తీసుకుంది. విగ్రహావిష్కరణ బౌద్ధ మత సంప్రదాయంలో జరగనుంది. దీనికి గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టేందుకు సంకల్పించారు. దేశంలో కొత్తగా నిర్మించే పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కానీ దీనిపై కేంద్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. దీని గురించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ జయంతి సందర్భంగా నేడు ఆవిష్కరణ జరగనుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.