Begin typing your search above and press return to search.
విద్యార్థుల ఆవేదన...అమెరికా ఆశ్యర్యపోయే వాదన
By: Tupaki Desk | 6 Feb 2019 5:59 PM GMTఅమెరికాలో అక్రమంగా ఉండేందుకు వందల మంది విద్యార్థులను నకిలీ విశ్వవిద్యాలయంలో చేరిన మన విద్యార్థుల ఉదంతం మలుపులు తిరుగుతోంది. విద్యార్థులను నకిలీ విశ్వవిద్యాలయంలో చేర్పించారనే ఆరోపణలపై వీరిని ఇటీవల అమెరికా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మిషిగాన్‌లోని ఫెడరల్ కోర్టు ముందు వీరిని హాజరుపరచగా, తాము నిర్దోషులమంటూ వాదించారు. వీరిలో ఫణిదీప్ కర్నాటీకి 10 వేల డాలర్ల పూచీకత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మిగిలిన ఏడుగురు-భరత్ కాకిరెడ్డి, సురేశ్ కందాల, ప్రేమ్ రామ్‌పీసా, సంతోష్ సామా, అవినాశ్ తక్కలపల్లి, అశ్వంత్ నూనె, నవీన్ ప్రత్తిపాటి తమ డిటెన్షన్ కొనసాగింపునకు సమ్మతించారు. అయితే, మరోవైపు బాధిత విద్యార్థుల విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తోంది. దీంతో విద్యార్థుల భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తమవుతోంది.
పే టు స్టే రాకెట్ గుట్టురట్టు చేసేందుకు అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ అధికారులు డెట్రాయిట్‌లో ఫార్మింగ్‌టన్ యూనివర్సిటీ పేరిట ఓ నకిలీ యూనివర్సిటీని స్థాపించి అండర్‌కవర్ ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. వారి వలలో చిక్కుకుని సుమారు 600 మంది విద్యార్థులు ఆ వర్సిటీలో చేరారు. వీరిలో అధిక సంఖ్యలో భారతీయులు ఉన్నారు. వీరిని ఆ నకిలీ యూనివర్సిటీలో చేర్పించిన 8 మంది భారతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వర్సిటీలో చేరిన విద్యార్థుల్లో 130 మంది అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు దేశం వదిలి వెళ్లిపోయారు. భారత విద్యార్థులను అదుపులోకి తీసుకోవడంతో అప్రమత్తమైన భారత ప్రభుత్వం విద్యార్థులను ఆదుకునేందుకు అక్కడి దౌత్య కార్యాలయ అధికారులను, భారత సంఘాలను రంగంలోకి దింపింది. భారత దౌత్య అధికారులు దేశవ్యాప్తంగా వివిధ డిటెన్షన్ సెంటర్లకు వెళ్లి భారత విద్యార్థులను కలుస్తున్నారు. విద్యార్థుల సహాయార్థం భారత దౌత్య కార్యాలయం హాట్‌లైన్‌ను తెరిచింది. నోడల్ అధికారిని కూడా నియమించింది.
దీంతోపాటుగా భారతీయ విద్యార్థుల అరెస్టుపై ఆందోళన వ్యక్తం చేస్తూ భారత ప్రభుత్వం గత శనివారం ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి డెమార్ష్ (దౌత్యపరమైన నోటీసు) జారీ చేసిన విషయం తెలిసిందే. వివిధ డిటెన్షన్ సెంటర్లలో ఉన్న తమ విద్యార్థులను కలిసేందుకు దౌత్య అధికారులను అనుమతించాలని, ఆ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని అందులో కోరింది. దీనిపై అమెరికా ప్రభుత్వం తాజాగా స్పందించింది. ఫార్మింగ్‌టన్ యూనివర్సిటీ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహించదని విద్యార్థులకు ముందే తెలుసు. అక్రమంగా అమెరికాలోనే ఉండాలనే ప్రయత్నంలో తాము తప్పు చేస్తున్నామన్న విషయం కూడా వారికి తెలుసు అని విదేశాంగ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. పే టు స్టే యూనివర్సిటీ వీసా కుంభకోణంలో అదుపులోకి తీసుకున్న 130 మంది విదేశీ విద్యార్థులకు తాము తప్పు చేస్తున్నామన్న విషయం ముందే తెలుసునని అమెరికా ప్రభుత్వం తెలిపింది. నిబంధనలను అతిక్రమంచి అమెరికాలో ఉండేందుకే వారు నకిలీ విశ్వవిద్యాలయంలో చేరానని పేర్కొంది.