Begin typing your search above and press return to search.
దేశ ప్రజల పై 129 లక్షల కోట్ల అప్పు.. అక్షరాలా కేంద్రం చేసిందే
By: Tupaki Desk | 30 March 2022 1:30 AM GMTదేశంలోని రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి. భారీ ఎత్తున అప్పులు తెచ్చుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రాలు అప్పుల పాలుకాకుండా.. నిలువరించాలంటూ.. అందరూ కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే.. ఇక్కడ చిత్రం ఏంటంటే.. కేంద్రమే లెక్కకు మించిన అప్పలు చేస్తుండడం. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం.. ఇప్పటి వరకు చేసిన అప్పులు.. రూ. 129 లక్షల కోట్లు. కరోనా సమయంలో కావొచ్చు.. మరే ఇతర పథకాలకైనా కావొచ్చు. మొత్తంగా గత ఏడాది డిసెంబరు నాటికి కేంద్రం చేసిన రుణాలు 129 లక్షల కోట్లు.
ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. ఇక్కడ చిత్రం ఏంటంటే.. మన కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసి.. పొరుగున ఉన్న భూటాన్, శ్రీలంక దేశాలకు అప్పులు ఇస్తుండడం. ఇలా.. ఇప్పటి వరకు చాలా మొత్తం అప్పులు ఇవ్వడం గమనార్హం. ఇక, తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ రుణ భారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22) డిసెంబర్ త్రైమాసికం ముగిసే నాటికి 2.15 శాతం పెరిగి రూ.128.41(సుమారు 129) లక్షల కోట్లకు చేరింది.
ప్రభుత్వ రుణ నిర్వహణ నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. గణాంకాల ప్రకారం, ఈ విలువలు రెండు త్రైమాసికాల్లో రూ.1,25,71,747 కోట్ల నుంచి రూ.1,28,41,996 కోట్లకు ఎగశాయి. మొత్తం రుణాల్లో (కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చెల్లించాల్సిన) పబ్లిక్ డెట్ వాటా ఈ కాలంలో 91.15 శాతం నుంచి 91.60 శాతానికి ఎగసింది. అంటే అప్పులు చేయడం పెరిగిపోయింది. ఇందులో డేటెడ్ సెక్యూరిటీల విషయానికి వస్తే సమీక్షా కాలంలో వాణిజ్య బ్యాంకుల వాటా 37.82 శాతం నుంచి 35.40 శాతానికి తగ్గింది.
డిసెంబర్ 2021 చివరి నాటికి బీమా కంపెనీలు, ప్రావిడెంట్ ఫండ్‌ల వాటాలు వరుసగా 25.74%, 4.33 శాతాలుగా ఉన్నాయి. సెప్టెంబర్ 2021 త్రైమాసికం చివరినాటికి 2.91 శాతంగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ షేర్ 2021 డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి 3.08 శాతానికి చేరింది. ఆర్‌బీఐ వాటా 16.98 శాతం నుంచి 16.92 శాతానికి స్వల్పంగా తగ్గింది. దాదాపు 25 శాతం డేటెడ్ సెక్యూరిటీల కాల వ్యవధి 5 సంవత్సరాల కంటే తక్కువ ఉంది. ఇది ఆర్థిక అస్థిరతను సూచిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రబుత్వం రాష్ట్రాలను అప్పులు చేయొద్దని ఎలా సుద్దులు చెబుతుందని అంటున్నారు పరిశీలకులు.