Begin typing your search above and press return to search.
యూపీలో ఘోర ప్రమాదం..13 మంది చిన్నారులు బలి
By: Tupaki Desk | 26 April 2018 6:07 AM GMTమోడీ ప్రియ శిష్యుడు.. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన దారుణమైన ఘోరం ఇప్పుడు అందరి మనసుల్ని కలిచివేస్తోంది. నిర్లక్ష్యంతో వ్యవహరించిన స్కూల్ బస్సు డ్రైవర్ పుణ్యమా అని 13 మంచి చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
దేశ వ్యాప్తంగా షాకింగ్ గా మారిన ఈ ఉదంతం కుషీనగర్ లో చోటు చేసుకుంది. పాఠశాల బస్సు ఒకటి పట్టాలు దాటే సమయంలో వేగంగా వస్తున్న రైలు ఈ బస్సును ఢీకొట్టేసింది. ఈ రైలు వేగానికి బస్సు రెండుముక్కలైనట్లు చెబుతున్నారు. అంతేనా.. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ఉండగా.. 13 మంది ఘటనాస్థలంలోనే మరణించారు.
రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద కాపలాదారుడు లేకపోవటంతోనే ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకుందని చెబుతున్నారు. రైలు వేగానికి బస్సు తునాతనకలైనట్లుగా చెబుతున్నారు. ఈ ప్రమాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ తీవ్ర దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున సాయాన్ని ప్రకటించి వెళ్లిపోయారు. ఇంత భారీ ప్రమాదం జరిగినప్పుడు..దీనికి పరిష్కారం మీద కంటే కూడా.. అప్పటికప్పుడు నష్ట పరిహారం చెల్లించే అంశం మీదనే పాలకులు దృష్టి పెడుతుంటారని.. ఇందుకు నేతల పరిస్థితి కూడా చెప్పక తప్పదు.