Begin typing your search above and press return to search.
కాళకేయ సైన్యంలో ఏడుగురు భారతీయులు
By: Tupaki Desk | 4 Aug 2015 7:39 AM GMT ప్రపంచానికి దడ పుట్టిస్తున్న ముష్కర మూక అది... ఐఎస్ ఐఎస్ పేరుతో పచ్చి నెత్తురు తాగుతున్న ఇస్టామిక్ స్టేట్ తీవ్రవాదులు నిజంగా నరరూప రాక్షసులే. సినిమా భాషలో చెప్పుకోవాలంటూ బాహుబలిలో కాళకేయుల్లాంటివారు. ఆ కాళకేయ సైన్యంలో భారతీయులూ ఉన్నారట. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 13 మంది భారతీయులు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ ఐఎస్) తీవ్రవాద గ్రూపులో చేరినట్లు భారత ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
అయితే... వారిలో ఆరుగురు ఇప్పటికే మరణించారట. ప్రస్తుతం ప్రాణాలతో ఏడుగురు ఉన్నారని ... వారిలో యుద్ధభూమిలో ఉన్నది ఒక్కరేనని... మిగతావారు వంటపని, డ్రైవర్లు, సహాయకులు వంటి పాత్ర పోషిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
ఇప్పుడున్నవారిలో మహారాష్ట్రకు చెందినవారు నలుగురున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ముగ్గరు సింగపూర్ , ఒమన్, ఆస్ట్రేలియాల నుండి వెళ్లిన భారతీయులు. కాగా గతంలో బెంగళూరు యువడొకరు ఐఎస్ ఐఎస్ లో చేరినట్లు వార్తలొచ్చాయి. తొలుత పెద్ద సంఖ్యలో యువత అటువైపు ఆకర్షితులైనా అనంతరం అక్కడి వాతావరణం పట్ల భయంతో వెనక్కు తగ్గుతున్నారు. పైగా వారి నుంచి తప్పించుకుని రావడమూ దుర్లభమే. ఆయుధాలపై ఆసక్తితో కొందరు అటుమళ్లుతున్నా అక్కడ వంటపని, ఇంటిపని వంటివే అప్పగిస్తుండడంతో నిరాశపడి వెనుదిరిగే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. అక్కడి నుంచి తప్పించుకురాలేక తిప్పలు పడుతున్నారు. బ్రిటన్ కు చెందిన కొందరు యువకులు ఎలాగోలా బయటపడి అక్కడి వివరాలన్నీ చెప్పడంతో తీవ్రవాద భావజాలం ఉన్నవారూ చాలామంది వెనుకాడుతున్నారు.