Begin typing your search above and press return to search.
పెళ్లి చూపులకు వెళ్లి 15 మంది దుర్మరణం
By: Tupaki Desk | 11 May 2019 4:50 PM GMTకర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై వెల్దుర్తి సమీపంలో ప్రైవేట్ బస్సు - తుఫాన్ వ్యాన్ - బైక్ ఢీ కొనడంతో 15 మంది మృతి చెందారు. బైక్ ను తప్పించబోయి ప్రైవేటు బస్సును తుఫాను వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందగా...పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు గద్వాల జిల్లా శాంతినగర్ మండలం రామపురం గ్రామస్తులుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిగా సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
మహబూబ్‌నగర్ జిల్లా వడ్డెపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మాల లక్ష్మన్న కొడుకు నిశ్చితార్థం కోసం తుఫాన్ వాహనంలో కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్లారు. నిశ్చితార్థం అనంతరం తిరిగి వస్తుండగా కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో రామాపురం గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. కాగా, ఘోర రోడ్డు ప్రమాదంలో జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పలువురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. సంఘటనలో గాయపడి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి అవసరమైన సాయం అందించాల్సిందిగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తక్షణమే స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పై గద్వాల జిల్లా కలెక్టర్ శశాంకతో సంఘటన వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.