Begin typing your search above and press return to search.
26/11 ముంబై మారణకాండ..నేటికి 13 ఏళ్లు..
By: Tupaki Desk | 26 Nov 2021 9:30 AM GMTముంబై నగరంలో అత్యంత కీలకమైన ప్రాంతం.. వందల సంఖ్యలో ప్రాణాలను అరిచేతిలో పెట్టుకున్న సమయం.. ఏ సమయంలో ఎవరి ప్రాణం పోతుందో తెలియని పరిస్థితి.. భిక్కు భిక్కుమంటూ దిక్కులు చూస్తున్న తాజ్ హోటల్లోని వారిని రక్షించేందుకు అటు ప్రభుత్వం ఇటు అధికారులు తలమునకలయ్యారు. ఓ వైపు చర్చలు సాగిస్తూనే.. మరోవైపు కొందరు సైనికులు సామాన్యప్రజలను రక్షించేందుకు వ్యూహం పన్నుతున్నారు.
ఇదంతా ఒకవైపైతే.. మరోవైపు తిండి తిప్పలు మానేసి కెమెరాను పట్టుకొని ఉన్న జర్నలిస్టులు.. ఎప్పుడు ఏం జరుగుతుందో వెంటనే ఇతరులకు సమాచారం అందించడానికి అక్కడే తిష్ట వేశారు..ఎన్ని ప్రయత్నాలు చేసినా 166 మంది ప్రాణాలు మాత్రం పోయాయి. దీంతో ఇప్పటికీ నవంబర్ 26 అంటే ముంబైలోని వారికి దడ పుట్టిస్తుంది.
2008 నవంబర్ 26 తేదీ అనగానే ప్రతీ భారతీయుని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆరోజు జరిగిన మారణ హోం ఇండియా ఇప్పటికీ మరిచిపోలేదు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు సృష్టించిన ఈ దాడి ఇప్పటికి మానని గాయంగానే మగిలింది.
ప్రపంచ ఉగ్రదాడుల్లోనే అతిపెద్దదిగా చెప్పుకుంటున్న ఇలాంటి దాడి మరోసారి జరగనివ్వబోమని భారత ఆర్మీ చెబుతోంది. ప్రస్తుతం అత్యంత ఆధునికమైన ఆయుధాలు భారత్ వద్ద ఉన్నాయని, ఎలాంటి ముష్కరులు తెగబడ్డా తిప్పి కొడతామని అంటోంది.
13 ఏళ్ల కిందట పాకిస్తాన్ లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం మీదుగా ముష్కరులు మంబైలోకి చొరబడ్డారు. అజ్మల్ సహా 10 మంది ఉగ్రవాదులు తాజ్, ఒబెరాయ్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినల్ దగ్గర నాలుగు రోజుల పాటు మారణకాండ సృష్టించారు.
ఈ ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మందికి పైగా గాయపడ్డారు. ఇక రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది దారుణ కాండకు పాల్పడిన పది మంది ముష్కరుల్లో 9 మందిని హతమార్చారు. ఉగ్రవాది కసబ్ ను మాత్రం ప్రాణాలతో పట్టుకున్నారు.
ఉగ్రవాదులను నిలువరించే క్రమంలో ఉగ్రవాద నిరోధక దళం చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్, ముంబై అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్ స్పెక్టర్ విజయ్ సలాస్కర్, అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ తుకారం ఓంబుల్ అమరులయ్యారు.
ఈ మారణహోమం జరిగి 13 ఏళ్లు గడిచినా ఇప్పటికీ దానిని మరిచిపోలేకపోతున్నారు. ఇక బాధిత కుటుంబాల్లో మాత్రం అప్పటి సంఘటనలు కళ్లముందు కదలాడుతున్నట్లే ఉన్నాయి. ఈ సందర్భంగా నాటి దాడుల్లో వీరమరణం పొందిన వారికి భద్రతా అధికారులు, పోలీసులు ఘనంగా నివాళులర్పించారు.
అయితే ముంబై ఉగ్రదాడి సూత్రధారి లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండ్ జకీ ఉర్ రెహ్మాన్ లక్వీకి ఈ ఏడాది జనవరిలో పాకిస్తాన్ కోర్టు జైలు శిక్ష విధించింది. ఉగ్రవాద నిరోధక చట్టం 1997లోని వివిధ సెక్షన్ల కింద ఈ శిక్షను ఖరారు చేసింది.
ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న ఆరోపణలపై ఆయనను ముందుగా అరెస్టు చేశారు. ఇక ముంబై దాడి తరువాత లఖ్వీని ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది.
నేటికి ఈ సంఘటన జరిగి 13 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా పోలీసులు, అధికారలు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ముంబై పోలీసుల్లోనూ విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు. బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్, ఆధునిక ఆయుధాలను వారికి సమకూర్చారు. ఎప్పడు ఎలాంటి సంఘటన జరిగినా ఏమాత్రం జడవకుండా వారిదగ్గర అయుధాలను ఉంచారు. దీంతో మునుపటి కంటే ఇప్పుడు ఉగ్రవాదులను తిప్పకొట్టడానికి అవసరమైన సదుపాయాలున్నాయని కొందరు పోలీసులు అంటున్నారు.