Begin typing your search above and press return to search.
3 నెలల్లో 130 కోట్ల ఫేక్ ఫేస్ బుక్ ఖాతాల్ని డిలీట్ చేశారట
By: Tupaki Desk | 23 March 2021 8:30 AM GMTఇటీవల కాలంలో తరచూ చర్చల్లోకి వస్తున్న ఫేస్ బుక్.. తన మీద వస్తున్న విమర్శల్ని.. సలహాల్ని.. సూచనల్ని ఎప్పటికప్పుడు పాటిస్తూ వస్తోంది. ఇవాల్టి రోజున ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న ఆన్ లైన్ మోసాలు.. సైబర్ నేరాలకు అడ్డాగా మారుతోంది ఫేస్ బుక్. తన మీద వస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు అధిగమించేందుకు తమ ఉద్యోగులు ఎంత కష్టపడతారన్న విషయాన్ని చెప్పిన వైనం ఆసక్తికరంగానేకాదు ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంది.
కేవలం మూడంటే మూడు నెలల వ్యవధిలో ఫేస్ బుక్ లోని ఫేక్ అకౌంట్లను నిలిపివేసేందుకు తాము భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది అక్టోబరు నుంచి డిసెంబరు వరకు 130 కోట్ల ఫేక్ ఖాతాల్ని డిలీట్ చేసినట్లుగా ఫేస్ బుక్ వెల్లడించింది.తప్పుడు సమాచారాన్ని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు. అరవైకి పైగా భాషల్లోని కంటెంట్ ను నిశితంగా పరిశీలించటానికి.. స్వతంత్ర ఫ్యాక్ట్ చెకర్స్ ను నియమించారని ఎఫ్ బీ వెల్లడించింది.
ఏదైనా సమాచారం తప్పుడన్నది తేలితే.. అలాంటి దానిని ఎక్కువమందికి చేరకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా ఫేస్ బుక్ ప్రతినిధి రోసెన్ వెల్లడించారు. అలాంటి సమాచారంపైన హెచ్చరిక సంకేతం ఉంటుందన్నారు. అలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
తామిస్తున్న సంకేతాన్ని చూసిన యూజర్లలో 90 శాతం మంది యూజర్లు తప్పుడు సమాచారాన్ని క్లిక్ చేయటం లేదన్నారు. కోవిడ్ 19 వ్యాక్సిన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్న కంటెంట్ మొత్తాన్ని తొలగించినట్లు చెప్పిన ఆయన.. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సును వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. మూడు నెలల్లో ఇన్ని కోట్ల ఫేక్ ఖాతాల్ని నిలిపివేస్తే.. మొత్తంగా మరెన్ని ఉంటాయి? విన్నంతనే ఉలిక్కిపడేలా చేసిన ఫేస్ బుక్ వ్యాఖ్యలు అందరిని మరోసారి అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని గుర్తు చేశారని చెప్పాలి.