Begin typing your search above and press return to search.
రౌడీషీటర్ల మేళా.. పోలీసుల సర్ ప్రైజ్
By: Tupaki Desk | 31 Aug 2019 10:17 AM GMTరౌడీని పాత కాలపు సినిమాల్లో విలన్లుగా మనకు చూపించారు. రౌడీషీటర్లను క్రూరులుగా - రాక్షసులుగా అభివర్ణించారు. ఆ తర్వాత కాలంలో రౌడీ పెళ్లాం - రౌడీ మొగుడు ఇలా రౌడీలనే బేస్ చేసుకొని హీరోలు సినిమాలు తీశారు. రౌడీ పాత్రల్లో మంచిదనాన్ని పంచారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ లాంటి దూకుడైన హీరో తననే ‘రౌడీ హీరో’గా ప్రమోట్ చేసుకుంటున్నారు.
అయితే ఇదంతా రీల్ రౌడీల కథ. మరి రియల్ రౌడీలు కూడా సమాజంలో ఉన్నారు కదా.. వరంగల్ లో కూడా దోపిడీలు - దొంగతనాలు - హత్యలు - అత్యాచారాలు చేసి పోలీసుల నియంత్రణలో ఉన్న రౌడీషీటర్లు ఇప్పుడు మారిపోయారట.. మొత్తం వరంగల్ కమిషనరేట్ పరిధిలో 783మందిపై రౌడీషీట్ ఓపెన్ అయ్యి ఉంటే అందులో 133 మంది రౌడీషీటర్లు మంచివారిగా మారిపోయారని.. ఎలాంటి క్రైమ్ చేయకుండా సత్ప్రవర్తనతో ఉన్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఇంకేముంది కరుడుగట్టినట్టుండే పోలీసుల మనసు కరిగిపోయింది. వారిపై ఉన్న రౌడీషీట్ ను ఎత్తివేసేందుకు నిర్ణయించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో తాజాగా వరంగల్ కమిషనర్ రవిందర్ ‘రౌడీమేళా’ను నిర్వహించారు. సత్ప్రవర్తన కలిగిన 133మంది రౌడీషీట్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇలా కరుడుగట్టిన రౌడీల పట్ల కఠువుగా ఉండే పోలీసులం మనం చూశాం. ఇప్పుడు మారిన వారిని అక్కున చేర్చుకొని ఏకంగా రౌడీషీటర్ల మేళా నిర్వహించి మరీ వారిపైనున్న రౌడీషీట్లను ఎత్తివేసిన పోలీసులపై ప్రశంసలు కురుస్తున్నాయి. రౌడీల మంచి మనసును చూసి వారి ప్రశాంత జీవితానికి పోలీసులు తీసుకున్న చర్యలను అందరూ అభినందిస్తున్నారు..