Begin typing your search above and press return to search.
‘‘అమ్మ’’ అంటే ఎంత అభిమానం అంటే..
By: Tupaki Desk | 25 May 2016 4:59 AM GMTవ్యక్తిపూజకు పరాకాష్ఠగా తమిళుల్ని చెప్పుకోవాలి. వారు కానీ అభిమానించారంటే వారి అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి.. ఆరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జయలలిత మీద అభిమానంతో అమ్మ అభిమానులు చేపట్టిన గుండు కార్యక్రమం ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. అమ్మ మీద అభిమానంతో.. ఆమె మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో అభిమానులు గుండు కొట్టించుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో 134 స్థానాల్లో అమ్మ పార్టీ అయిన అన్నాడీఎంకే గెలవటంతో.. ఆ గుర్తుగా 134 మంది పార్టీ కార్యకర్తలు గుండు కొట్టించుకున్నారు. గుండు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న వారు.. ఆ ఆనందాన్ని అమ్మతో పంచుకోవటానికి అమ్మ ఇంటికి వెళ్లారు.
కానీ.. ఈ గుండు బ్యాచ్ ని కలుసుకోవటానికి అమ్మ ఆసక్తి ప్రదర్శించలేదు. దీంతో.. వారు వెనుదిరగాల్సి వచ్చింది. తన మీద అభిమానంతో ఇలా గుండు కొట్టించుకున్న వారిని కలిసి.. సంతోషాన్ని వ్యక్తం చేస్తే.. రాష్ట్రం మొత్తం గుండు కార్యక్రమం ఒక ఉద్యమంగా సాగుతుందన్న విషయం మీద అమ్మకు క్లారిటీ ఉన్నట్లుగా ఉంది. అందుకేనేమో గుండు బ్యాచ్ ను లైట్ ను తీసుకున్నట్లున్నారు.