Begin typing your search above and press return to search.
పక్షి దెబ్బకు 14 కోట్ల నష్టం
By: Tupaki Desk | 19 Oct 2019 5:49 AM GMTఓ చిన్న పక్షి దెబ్బకు ఏకంగా 14 కోట్ల నష్టం వాటిల్లిందంటే నమ్మగలరా.. కానీ ఇది నిజం.. అమెరికాలో చోటుచేసుకున్న ఈ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది.. దాదాపు 10వేల కోట్ల అత్యాధునిక విమానాన్ని ఓ చిన్న పక్షి ఢీకొన్న కారణంగా ఈ 14 కోట్ల నష్టం వాటిల్లడం గమనార్హం.
అమెరికాలోని దిగ్గజ నేతలకు ఈ విమానం రక్షణం కల్పిస్తుంది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అణుదాడులను సైతం కాచుకునేలా ఈ విమానాన్ని అమెరికా తయారు చేసుకుంది. అయితే అంతటి ఓ విమానాన్ని ఓ పక్షి ఢీకొని 14 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.
అమెరికాలోని మేరీల్యాండ్ రివర్ నేవల్ ఎయిర్ స్టేషన్ లో ఈనెల 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ-6బీ మెర్య్కూరీ అనే అత్యాధునిక అమెరికన్ దేశాధినేతల ఈ భారీ విమానం రన్ వైకి వస్తున్న క్రమంలో ఓ చిన్న పక్షి ఢీకొంది. పక్షి కారణంగా విమానంలోని నాలుగు ఇంజిన్లలో ఒకటి దెబ్బతింది. దీంతో 14 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు..
ఇలా ఓ చిన్న పక్షి కారణంగా ఇంత భారీ ప్రమాదం జరగడం అమెరికాలోనే ఇదే అత్యంత భారీదట.. 14 కోట్ల నష్టం వాటిల్లిన ఈ ప్రమాదాన్ని వైమానిక దళం ఏకంగా ‘ఏ క్లాస్’ ప్రమాదంగా గుర్తించడం విశేషం.