Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : కర్ణాటకలో 14 రోజుల లాక్ డౌన్ !
By: Tupaki Desk | 26 April 2021 9:46 AM GMTభారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభన భయంకరంగా కొనసాగుతుంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య వీపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఎంతో మంది కరోనా వైరస్ వలన ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం రేపట్నుంచి 14 రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధించిది . రేపు రాత్రి నుంచి ఈ లాక్ డౌన్ అమలు కానుంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం (ఏప్రిల్-27) నుంచి 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు యడియూరప్ప సర్కార్ ప్రకటించింది. ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు మాత్రం ఉదయం 6 గంటల నుంచి 10వరకు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
10గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో షాపులు మూసేయాలని , ఒకవేల మూసేయకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని తెలిపింది. ఇక ఆల్కహ్కాల్ లేదా మద్యం హోం డెలివరీకి అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ఎన్నికలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్రంలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పూర్తిగా మూసేస్తున్నట్టు ప్రకటించారు. కేవలం నిర్మాణ,తయారీ,వ్యవసాయ రంగాలకు మాత్రమే తమ కార్యకలాపాలు కొనసాగించుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లాల మధ్య ప్రజా రవాణాను పూర్తిగా నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం ఎమర్జెనీ కేసులకు మాత్రమే మినహాయింపు ఇవ్వనున్నారు. కాగా,కొద్ది రోజులుగా కర్ణాటకలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా బెంగళూరులో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదు అయ్యే కేసుల్లో దాదాపుగా 60 శాతం కేసులు ..ఒక్క బెంగళూరు సిటీలోనే నమోదు అవుతున్నాయి.