Begin typing your search above and press return to search.
ఎర్రబెల్లి జైలుకు వెళ్లక తప్పదా?
By: Tupaki Desk | 28 Sep 2015 9:54 AM GMTతెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో శరాఘాతం లాంటి అంశంగా చెప్పాలి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సమయంలో.. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి రావటం ఇప్పుడా పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
ఆదివారం వరంగల్ జిల్లా పాలకుర్తి మార్కెట్ యార్డు శంకుస్థాపన సమయంలో ఎమ్మెల్యే హోదాలో ఎర్రబెల్లి అక్కడకువెళ్లటం.. ఆయన్ను అధికార టీఆర్ ఎస్ నేతలు అడ్డుకోవటం.. దీంతో రెండు వర్గాల ఘర్షణ చోటు చేసుకోవటం తెలిసిందే.
ఈ ఘటనలో ఎస్ ఐతో పాటు పలువురు గాయపడ్డారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం ఆయన్ను జనగామ కోర్టుకు హాజరుపర్చారు. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. ఏదో చిన్న కేసుతో పోతుందని భావిస్తే.. చివరకు జైలుకు వెళ్లే వరకూ రావటంతో ఉలిక్కిపడ్డ తెలంగాణ తెలుగు తమ్ముళ్లు అప్పటికప్పుడు బెయిల్ పిటీషన్ ను దాఖలు చేశారు.
బెయిల్ పిటీషన్ పై న్యాయమూర్తి కానీ సానుకూలంగా స్పందించని పక్షంలో.. ఎర్రబెల్లి జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. ఎర్రబెల్లికి బెయిల్ లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. మరి.. న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.