Begin typing your search above and press return to search.

తెలంగాణ మందుబాబుల‌కు చేదువార్త‌!

By:  Tupaki Desk   |   2 Aug 2018 7:33 AM GMT
తెలంగాణ మందుబాబుల‌కు చేదువార్త‌!
X
మందుబాబుల‌కు ఇదో బ్యాడ్ న్యూస్. నిత్యం త‌మ‌ను తాము గుల్ల చేసుకుంటూ ప్ర‌భుత్వానికి ఆదాయంతో క‌ళ‌క‌ళ‌లాడే మండుబాబులకు షాకిచ్చేలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మ‌ద్యం త‌యారీ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌పై తెలంగాణకు చెందిన డిస్ట‌ల‌రీ కంపెనీలు గుర్రుగా ఉన్నాయి.

ఎన్నిసార్లు తాము మొత్తుకున్నా.. త‌మ న్యాయ‌మైన డిమాండ్ల‌ను తీర్చే విష‌యంలో తెలంగాణ స‌ర్కారు లైట్ తీసుకుంటుద‌న్న ఆగ్ర‌హంతో వారు తీవ్ర‌మైన నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

విస్కీ లైసెన్స్ ఫీజుల తో భారీగా ఆదాయం వ‌చ్చే తెలంగాణ స‌ర్కారు తీరుపై డిస్ట్ర‌ల‌రీ య‌జ‌మానులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. దేశంలో మ‌రెక్క‌డా లేని రీతిలో తెలంగాణ‌లో డ‌బుల్ గా వ‌సూలు చేస్తున్న ప‌న్నును యాభై శాతం త‌గ్గించాల‌ని వారు కోరుతున్నారు. తెలంగాణ ప‌క్క‌నున్న ఏపీతో స‌హా.. త‌మిళ‌నాడు.. క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో లైసెన్స్ ఫీజుల వ‌సూలు మొత్తం త‌క్కువ‌గా ఉంటే.. తెలంగాణ‌లో మాత్రం అత్య‌ధికంగా ఉంద‌ని వారు త‌ప్పు ప‌డుతున్నారు.

దేశంలో మరే రాష్ట్రంలో లేనంత భారీగా ప‌న్ను వ‌సూలు చేస్తున్నార‌ని.. త‌మ డిమాండ్ల‌పై ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించ‌ని నేప‌థ్యంలో త‌మ ఉత్ప‌త్తిని నిలిపివేస్తున్న‌ట్లుగా డిస్ట‌ల‌రీ య‌జ‌మానులు పేర్కొంటున్నారు. ఉత్ప‌త్తిని నిలిపివేసిన క్ర‌మంలో.. తెలంగాణ వ్యాప్తంగా విస్కీ అమ్మ‌కాలు ఆగే అవ‌కాశం ఉంది. మొత్తం 19 డిస్ట‌ల‌రీ కంపెనీల‌కు కాను.. 14 త‌యారీ యూనిట్లు లిక్క‌ర్ ఉత్ప‌త్తిని నిలిపివేయ‌టంతో విస్కీ కొర‌త ఏర్ప‌డ‌నుంది. మ‌రి.. దీనిపై తెలంగాణ స‌ర్కారు ఎప్ప‌టికి స్పందిస్తుందో చూడాలి. లేదంటే.. మందుబాబుల‌కు తెగ ఇబ్బందులు ప‌డే అవ‌కాశం మ‌స్తుగా ఉంది.