Begin typing your search above and press return to search.

ఢిల్లీ లో మరో 14 మంది వైద్య సిబ్బందికి కరోనా - క్వారంటైన్‌ లో డాక్టర్లు!

By:  Tupaki Desk   |   24 April 2020 7:30 AM GMT
ఢిల్లీ లో మరో 14 మంది వైద్య  సిబ్బందికి కరోనా - క్వారంటైన్‌ లో డాక్టర్లు!
X
కరోనా మహమ్మారి ఇప్పుడు దేశ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తుంది. రోజురోజుకి పెరిగిపోతున్న కరోనా భాదితులని చూసి ప్రజలలో ఆందోళన పెరుగుతుంది. అయితే , కరోనా సోకిన వారికీ తమ ప్రాణాలని పనంగా పెట్టి మరీ ట్రీట్మెంట్ చేస్తున్న వైద్యులకు కూడా వ్యాధి సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో 54 మంది వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకిందని విషయం ఇంకా మరచిపోకముందే, దేశ రాజధానిలో కూడా మరికొందరికీ వచ్చిందని, వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న జహంగిరిపురిలో వైద్య సిబ్బందికి వ్యాధి అంటుకుంది అని ప్రచార మాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.

ఢిల్లీ జహంగిరిపురి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు వైద్య సేవలు అందిస్తోన్న దాదాపు 14 మంది డాక్టర్లు, నర్సులకు వ్యాధి సోకింది అని కొందరు చెప్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. మరో వైపు పంజాబ్‌ లోని ఫాగ్వారా కు చెందిన 6 నెలల చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నెల 9వ తేదీన చండీగఢ్‌ లోని పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిడియాట్రిక్ సెంటర్ ‌లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. వెంటిలేటర్‌ పై ఉంచే క్రమంలో వైరస్ బయటపడింది. దీంతో వైద్యులు ఆందోళన చెందారు. డాక్టర్లు సహా 54 మంది క్వారంటైన్‌ లోకి వెళ్లి పోయారు.

ఢిల్లీలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2 వేల 376 మందికి చేరింది. గురువారం ఒక్కరోజే 128 మందికి పాజిటివ్ కేసులు నమోదవడం ప్రభుత్వ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మృతుల సంఖ్య 50కి చేరి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇటు దేశ వాణిజ్య రాజధాని ముంబై లో వైరస్ సోకిన వారి సంఖ్య 5 వేలకు చేరింది. గురువారం ఒక్క రోజే 478 మందికి వ్యాధి సోకిందని అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 269మంది చని పోయారు.