Begin typing your search above and press return to search.

తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడబోతున్నాయి!

By:  Tupaki Desk   |   2 Sep 2015 12:19 PM GMT
తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడబోతున్నాయి!
X
తెలంగాణ రాష్ట్రంలో మ‌రో 14 కొత్త జిల్లాలు రాబోతున్న‌ట్టు చాలారోజులుగా చర్చ జ‌రుగుతూ వ‌స్తోంది. దీనికి సంబంధించిన కార్యాచ‌ర‌ణ మొద‌లైన‌ట్టు తెలుస్తోంది. కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావు వివిధ సంద‌ర్భాల్లో చెబుతూ వ‌స్తున్నారు. దీనికి అనుగుణంగా ఇప్పుడున్న 10 జిల్లాల‌తోపాటు అద‌నంగా 14 జిల్లాలు చేర్చేందుకు క‌స‌ర‌త్తు మొద‌లైంద‌నే చెప్పాలి.

జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా అప్ప‌ట్లో ఉమ్మ‌డిరాష్ట్రంగా ఉన్న‌ప్పుడు ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ జిల్లాల ఏర్పాటు చ‌ట్టం -1974ను తెలంగాణ‌లో వ‌ర్తింప‌జేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే చ‌ట్టంలో కొన్ని మార్పులు చేసి తెలంగాణ డిస్ట్రిక్ట్ ఫార్మేష‌న్ యాక్ట్‌-2015 పేరుతో చ‌ట్టాన్ని తీసుకురాబోతున్న‌ట్టు స‌మాచారం. దీనికి సంబంధించి మంత్రివ‌ర్గ స‌మావేశంగా ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు. మంత్ర‌వ‌ర్గ భేటీలో చ‌ట్టానికి ఆమోదం తెలిపే అవ‌కాశాలున్నాయి ప్ర‌భుత్వ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. ఈ చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చిన వెంట‌నే జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ ఊపందుకుంటుంది. పాల‌నా సౌల‌భ్యం కోస‌మే కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని స‌ర్కారు చెబుతూ వ‌స్తోంది. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు మరింత చేర‌వు అవుతుంద‌నీ... ప‌థ‌కాల అమ‌లు కూడా మ‌రింత ప‌క్కాగా నిక్క‌చ్చిగా జ‌రుగుతుంద‌ని పాల‌క ప‌క్ష‌నేత‌లు చెబుతున్నారు.

మెద‌క్ జిల్లాలోని సిద్ధిపేట‌ - సంగారెడ్డి... మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని వ‌న‌ప‌ర్తి - నాగ‌ర్ క‌ర్నూలు... న‌ల్గొండలో సూర్యాపేట‌ - ఖ‌మ్మం జిల్లాలో భ‌ద్రాచ‌లం - వరంగ‌ల్‌లో జ‌న‌గామ‌ - ఆచార్య జ‌య‌శంక‌ర్ పేరుతో భూపాల‌ప‌ల్లి... క‌రీంన‌గ‌ర్‌లో జ‌గిత్యాల‌.. ఆదిలాబాద్‌లో మంచిర్యాల‌... రంగారెడ్డిని వికారాబాద్ జిల్లాగా మార్చ‌డంతోపాటు - భాగ్య‌న‌గ‌రంలో మ‌రో నాలుగు కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేయాల‌న్న‌ది ప్ర‌స్తుత ప్ర‌తిపాద‌న‌. అయితే, ఈ జిల్లాల ఏర్పాటు అనేది ఒకేసారి కాకుండా... ద‌శ‌ల‌వారీగా జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు.