Begin typing your search above and press return to search.
14 మంది టీడీపీ ఎమ్మెల్యేలు..వైఎస్సార్ కాంగ్రెస్ లోకి జంప్..?
By: Tupaki Desk | 1 April 2017 9:02 AM GMTతెలుగుదేశం పార్టీకి ఝలక్ తగలనుందా? పలువురు ఎమ్మెల్యేలు తెలుగుదేశాన్ని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరగనుందా? ఇప్పటికే ఇందుకు సంబంధించి కొందరు సంప్రదింపులు జరుపుతున్నారా? అంటే.. ఔను అంటున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా పద్నాలుగు మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఝలకిచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి తెలుగుదేశం వద్ద అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి.. వైకాపా దగ్గర ఏమున్నాయి? అంటే.. ప్రస్తుత పరిణామాలు అందుకు కారణం అవుతున్నాయనే మాట వినిపిస్తోంది.
రేపు జరగనున్న మంత్రి వర్గ విస్తరణ తెలుగుదేశం పార్టీలో కొత్త చిచ్చును పుట్టించనుంది. ప్రత్యేకించి ముగ్గురు ఫిరాయింపుదారులైన ఎమ్మెల్యేలకు తెలుగుదేశం అధినేత మంత్రి పదవులను ఇస్తున్నాడనే మాట తెలుగుదేశం పార్టీ శ్రేణులను తీవ్రమైన అసహనానికి గురి చేస్తోంది. దశాబ్దాలుగా పార్టీలో ఉన్న తమను పక్కన పెట్టి నిన్నలా మొన్న వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం ఏమిటి? అనేది తెలుగుదేశం పార్టీ పాత కాపుల వాదన. ఇప్పటికే ఫిరాయింపుదారులకు మంత్రి పదవులను ఇవ్వొద్దు.. అని బాబుకు వారంతా ఫిర్యాదు చేశారు. అయితే వారిని చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోకుండా.. మంత్రి పదవులను ఇస్తున్నాడు.
దీంతో సహజంగానే వారికి అసహనం కలుగుతుంది. తమకు దక్కలేదనే బాధ ఒకటైతే, నిన్నలా మొన్న వచ్చినోళ్లకు పదవులా అనే అసహనం మరోటి. ఇక రాష్ట్రం లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి అంటే.. ఏమీ బాగోలేదని చెప్పాల్సి ఉంటుంది. మూడేళ్ల పాలనతో ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరింది. అవినీతి, కుల పిచ్చి రాజ్యం ఏలుతోందనే మాటే అంతటా వినిపిస్తోంది. హామీల అమలులో చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యాడు.
రైతులు, మహిళలు బాబుపై ఏదో మోజుపడి ఓట్లు వేయలేదు.. కుల పిచ్చితోనో, మత పిచ్చితోనో ఓట్లు వేయలేదు.. రుణమాఫీ వంటివే వారిని టీడీపీకి ఓటు వేసేలా చేశాయి. అయితే ఆ హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దీంతో వారిలో వ్యతిరేకత ప్రబలుతోంది. ఇక ప్రతిపక్ష పార్టీ చేస్తున్న అవినీతి ఆరోపణలకు బలం చేకూరుతోంది. కాగ్ నివేదిక చంద్రబాబు పాలనకు అద్దం పట్టింది. అవినీతి, అబద్ధాలు తప్ప మరేం లేదని తేల్చింది.
ఇవన్నీ రేపటి ఎన్నికల్లో తెలుగుదేశం విజయావకాశాలను శాసిస్తాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతమంది ఎమ్మెల్యేలను చంద్రబాబు చేర్చుకున్నా.. కొన్నాడని అంతా అనుకుంటున్నారు కానీ, బాబు ఏదో అద్భుతాలు చేస్తున్నాడని ఎవ్వరూ నమ్మడం లేదు. ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీ పరిస్థితి మునుగుతున్న నావలా తయారవుతోంది.
ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు తాము కోరుకున్నది చేయడం లేదు, తాము చెప్పినది వినడం లేదు, తమను ఆదరించడం లేదు.. దీంతో ఏకంగా 14 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. ఒక్కసారి విస్తరణ పూర్తి కాగానే.. మొదలయ్యేది గందరగోళమే అని తెలుస్తోంది. ఇప్పటికే వీళ్లంతా జగన్ వ్యక్తిగతంగా టచ్ లో ఉన్నారని.. సమయం చూసి టీడీపీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మరీ జంప్ చేసే అవకాశాలున్నాయని సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/