Begin typing your search above and press return to search.
ఏపీ వ్యక్తితో యూపీలో 14 గ్రామాలు బంద్
By: Tupaki Desk | 14 April 2020 9:30 AM GMTరాష్ట్రం కాని రాష్ట్రంలో లాక్ డౌన్ తో ఇరుక్కుపోయిన తెలుగు వ్యక్తి కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఈ వైరస్ బారిన పడడంతో అతడి వలన ఆ రాష్ట్రంలో ఏకంగా 14 గ్రామాలను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి గతనెలలో ఢిల్లీలో జరిగిన జమాత్ కార్యక్రమానికి వెళ్లాడు. ఆపై ఆంధ్రప్రదేశ్ కు తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే అప్పటికే లాక్ డౌన్ విధించడంతో ఆంధ్రప్రదేశ్ కు వెళ్లలేక ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇరుక్కు పోయాడు.
ఉత్తరప్రదేశ్ లోని బడౌన్ జిల్లాలో భవానీపూర్ కాలీలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి నివసిస్తున్నాడని అధికారులకు సమాచారం అందించింది. అతడు గత నెలలో ఢిల్లీలో జరిగిన జమాత్ కార్యక్రమం లో పాల్గొన్నారనే విషయం స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో అతడిని అధికారులు క్వారంటైన్ లో ఉంచారు. అతడి నమూనాలు పరీక్షించి ల్యాబ్ కు పంపగా కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ పరిసర గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. జమత్ కార్యక్రమానికి వెళ్లడంతోనే అతడికి వైరస్ సోకి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో అతడు ఉంటున్న గ్రామానికి 3 కిలో మీటర్ల వ్యాసార్థంలో ఉన్న గ్రామాలను మూసి వేస్తున్నట్లు బడాన్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ సందర్భంగా కరోనా ఆయా గ్రామాల్లో వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అతడికి ప్రస్తుతం ఆస్పత్రి లో చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో కరోనా తీవ్రంగానే ఉంది. అక్కడ కరోనా కేసులు 500 దాటాయి. ఒక్క బడౌన్ జిల్లాలోనే కరోనా బాధితుల సంఖ్య 134కు చేరడంతో అక్కడి అధికార యంత్రాంగం లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అతడికి వైద్య సేవలు సత్వరమే అందిస్తున్నారు.