Begin typing your search above and press return to search.

తగ్గేదేలే.. అక్కడ మరోసారి పేలిన గన్‌.. 14 మంది మృతి!

By:  Tupaki Desk   |   23 Nov 2022 9:34 AM GMT
తగ్గేదేలే.. అక్కడ మరోసారి పేలిన గన్‌.. 14 మంది మృతి!
X
అగ్రరాజ్యం తుపాకి కాల్పుల మోతలు ఆగడం లేదు. ఇప్పటికే ఇటీవలకాలంలో పలుమార్లు పలు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో కిరాతకులు అమాయకులైన ప్రజలు, స్కూల్‌ చిన్నారులను కాల్చి చంపిన సంగతి తెలిసిందే.

గన్‌ కల్చర్‌కు చరమగీతం పాడతామని.. కఠిన నిబంధనలు తెస్తామని.. అందరికీ అందుబాటులో తుపాకులు లేకుండా చేస్తామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ అప్పట్లో ఘనంగా ప్రకటించారు. ఈ దిశగా కొంత ముందుకు కూడా వెళ్లారు.

అయినా సరే గన్‌ కల్చర్‌ ధాటికి మరో 14 మంది అమాయకులు తాజాగా బలైపోయారు. అమెరికాలోని వర్జీనియాలోని వాల్‌మార్ట్‌ స్టోర్‌లో ఒక దుండగుడు జరిపిన కాల్పులకు 14 మంది బలయ్యారని వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాల్పుల తర్వాత నిందితుడు అదే స్టోర్‌లో తనను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కాగా నిందితుడు వాల్‌మార్ట్‌ స్టోర్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. స్టోర్‌ మేనేజర్‌ బ్రేక్‌ రూంలోకి చొరబడి అక్కడున్నవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. దాదాపు 35–40 నిమిషాల పాటు జరిపిన ఈ కాల్పుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రాథమికంగా తెలుస్తోంది.

ఘటన విషయం తెలుసుకుని పోలీసులు అక్కడికి చేరుకునేసరికి నిందితుడు అదే గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

కాగా ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ తదితరులు తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గన్‌ కల్చర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంతమొందిస్తామని బైడెన్‌ మరోమారు ప్రతిన చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.