Begin typing your search above and press return to search.

వైఎస్సార్సీపీ లో 14 మంది ఎంపీలు ఫెయిలయ్యారా?

By:  Tupaki Desk   |   12 Aug 2019 8:53 AM GMT
వైఎస్సార్సీపీ లో 14 మంది ఎంపీలు ఫెయిలయ్యారా?
X
ఇరవై ఐదు ఎంపీ సీట్లలో 22 సీట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు ఏపీ ప్రజలు. మరి ఆ ఎంపీల పనితీరు గురించి ప్రజల కన్నా ముందే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించారట. వారి పనితీరు ఎలా ఉందనే అంశం గురించి ఆయన ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నట్టుగ తెలుస్తోంది. అందులో భాగంగా వారికి ఎన్ని మార్కులు పడుతున్నాయనే అంశం గురించి కూడా పార్టీలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోని 22 మంది లోక్ సభ సభ్యుల్లో జగన్ వద్ద ఇప్పటి వరకూ పాస్ మార్కులు పడింది కేవలం ఎనిమిది మందికే అనే టాక్ వినిపిస్తూ ఉంది. లోక్ సభలో ప్రశ్నలు అడగడం - కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం తోపాటు నియోజకవర్గంలో పనితీరు విషయంలో కూడా జగన్ వారి పనితీరు మీద దృష్టి నిలిపినట్టుగా తెలుస్తోంది.

అందులో భాగంగా వారిలో 14 మంది మినిమం పాస్ మార్కులను కూడా పొందలేకపోతున్నారట. దానికి అనేక రీజన్లున్నాయి. వారిలో కొందరు సభలో యాక్టివ్ గా ఉండటం లేదు. చర్చల్లో పాల్గొనడం లేదు. అలాగే రాష్ట్రానికి నిధులను సాధించుకురావడంలో కూడా వారు ఫెయిల్ అవుతున్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి గుర్తిస్తున్నారట. ఇక మరి కొందరు తమ తమ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలతో గొడవలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో విబేధాలతో వారు అధినేత దృష్టికి వెళ్తున్నారట.

ఈ పరిణామాల నేపథ్యంలో ఎంపీల పనితీరులో పాస్ మార్కులు పొందుతున్నది కొందరు మాత్రమే అని సమాచారం. మిగిలిన వారు కూడా పని తీరును మార్చుకోవాలని అధినేత నుంచి ఆదేశాలు వస్తున్నట్టుగా తెలుస్తోంది.