Begin typing your search above and press return to search.
హెచ్1బీ అమెరికా బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కంపెనీలు ఇవే
By: Tupaki Desk | 11 Feb 2018 4:19 AM GMTతన వలస విధానాన్ని సమీక్షిస్తున్న అమెరికా ఈ క్రమంలో కీలక సూచనలు చేస్తోంది. కీలకమైన హెచ్1బీ వీసాల విషయంలో ఓ వైపు దూకుడుగా సవరణలు చేస్తూనే మరోవైపు సూచనలు సైతం ఇస్తోంది. తాజాగా హెచ్-1బీ వీసాల దరఖాస్తుల కు సంబంధించి అమెరికా కార్మిక విభాగం పలు సూచనలు చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేని 15 సంస్థల పేర్లను విడుదల చేసింది. ఈ జాబితా ఇండియాతోపాటు ప్రపంచంలోని చాలా దేశాలు జాగ్రత్తగా పరిశీలించాలని సూచించింది.
తాజా ఉత్తర్వుల్లో కావాలని పలుమార్లు ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీలుగా వీటిని గుర్తించి - ఆయా కంపెనీల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవద్దని హెచ్చరించింది. ఈ కంపెనీలపై దర్యాప్తు జరిపేందుకు సిద్ధమవుతున్నట్టు కార్మిక విభాగం తెలిపింది. విదేశీ ఉద్యోగులను తీసుకునే క్రమంలో కావాలని నిబంధనలు ఉల్లంఘించడం లేదా వివరాలు తప్పుగా సమర్పించిన కంపెనీలను ఈ జాబితాలో ఉంచుతామని లేబర్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. హెచ్ -1బి అనేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. దీని కింద ప్రత్యేక నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులను అమెరికా కంపెనీలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఏటా లాటరీ పద్ధతిలో 65 వేల వరకూ హెచ్-1బి వీసాలను జారీ చేస్తారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్-1బి వీసాల జారీపై ఎన్నో ఆంక్షలు విధిస్తోందనే సంగతి తెలిసిందే.
కాగా, అమెరికా విడుదల చేసిన 15 కంపెనీలు ఇవే… ఏజెల్ టెక్నాలజీస్(న్యూజెర్సీ) - అమికా టెక్నాలజీ (కెంట్ - వాషింగ్టన్) - క్లిన్నార్ ఎల్ ఎల్ సి (షికాగో - ఇలినాయిస్) మాక్రో నెట్ వర్క్ (న్యూయార్క్ - కాలిఫోర్నియా) - డెల్టా సెర్చ్ ల్యాబ్స్(కేంబ్రిడ్జ్ - మసాచుసెట్స్) - ఎన్ వైసి హెల్త్ కేర్ స్టాఫింగ్(న్యూయార్క్) - ఫోస్కామ్ డిజిటల్(హూస్టన్ - టెక్సాస్) - జీ హెల్త్ కేర్ ఎల్ ఎల్ సి(శాన్ జోస్ - కాలిఫోర్నియా) - ఇన్ కాన్ కార్పొరేషన్(సన్నీవేల్ - కాలిఫోర్నియా) - ఎండి2 సిస్టమ్స్(వర్జీనియా) - రీడ్ స్ట్రా డైరీ లిమిటెడ్(మెన్ డాన్ - మిషిగాన్) నిషె సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్(హూస్టన్ - టెక్సాస్) - నార్తర్న్ కాలిఫోర్నియా యూనివర్సల్ ఎంటర్ ప్రైజ్ కార్పొరేషన్( శాన్ జోస్ - కాలిఫోర్నియా) - టెలవా నెట్ వర్క్(శాన్ ఫ్రాన్సిస్కో - కాలిఫోర్నియా) - టెక్ వైర్ సొల్యూషన్స్(జెర్సీ సిటీ - న్యూజెర్సీ).