Begin typing your search above and press return to search.
తెలంగాణలో 15 క్రికెట్ అకాడమీలు.. ధోనీ సంచలన నిర్ణయం..!
By: Tupaki Desk | 13 Feb 2021 4:30 AM GMTతన ఆటతీరుతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న ధోనీ .. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వ్యాపారంలోనూ తనదైన మార్క్‌ను చూపిస్తున్నాడు. కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారాన్ని కూడా స్టార్ట్ చేశాడు. అయితే గ్రామీణ క్రీడాకారుల్లో ఉండే ప్రతిభను వెలికితీసేందుకు ధోనీ క్రికెట్ అకాడమీలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల ఆయన అకాడమీలు ఉన్నాయి. ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంస్థ, బ్రెయినియాక్స్ బీ అనే సంస్థల సహకారంతో ధోనీ క్రికెట్ అకాడమీలను నెలకొల్పుతున్నారు.
అయితే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 15 క్రికెట్ అకాడమీలు నెలకొల్పాలని ధోనీ నిర్ణయం తీసుకున్నాడట. ఈ విషయాన్ని ఆర్కా స్పోర్ట్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, భారత మాజీ అండర్-19 ప్రపంచకప్ జట్టు సభ్యుడు మిహిర్ దివాకర్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా క్రికెట్ అకాడమీలను నెలకొల్పడమే తమ లక్ష్యమని దివాకర్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యమని ఆయన చెప్పారు.
మరోవైపు త్వరలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల్లో మరిన్ని క్రికెట్ అకాడమీలు నెలకొల్పుతామన్నారు.
అకాడమీ కోచింగ్ డైరెక్టర్‌గా సౌతాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ డారెల్ కలీనన్ కొనసాగుతారన్నారు. బళ్లారిలో మొదటి అకాడమీని ప్రారంభించనున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పటికే భారత్‌లో 50కి పైగా కేంద్రాలు, విదేశాల్లో మూడు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ధోనీ త్వరలో విద్యారంగంలోకి అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం.