Begin typing your search above and press return to search.

టీటీడీపై కరోనా దెబ్బ ... 15 మంది ఉద్యోగులు మృతి !

By:  Tupaki Desk   |   30 April 2021 10:38 AM GMT
టీటీడీపై కరోనా దెబ్బ ... 15 మంది ఉద్యోగులు మృతి !
X
కరోనా వైరస్ మహమ్మారి టీటీడీ ఉద్యోగులపై పంజా విసురుతోంది. శుక్రవారం నాడు కరోనా వైరస్ తో ముగ్గురు ఉద్యోగులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ తో మరణించిన ఉద్యోగుల సంఖ్య 15 కి చేరింది. అన్నదానం డిప్యూటీ ఈవోతో పాటు మరో ఇద్దరు ఇవాళ కరోనా వైరస్ తో మృతి చెందారు. గత ఏడాది కూడ కరోనా తో టీటీడీలో పలువురు మరణించారు. గత ఏదాది ఆగష్టు మాసంలో కరోనాతో 743 మంది బాదపడ్డారు.

వీరిలో 402 మంది కరోనా నుండి కోలుకొన్నారు. గత ఏడాదిలో ప్రముఖ అర్చకులు కూడ కరోనా కారణంగా మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కరోనా కేసులు పెరగకుండా టీటీడీ పాలకవర్గం, జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటికే తిరుపతిని కంటైన్మెంట్ జోన్ గా అధికారులు ప్రకటించారు. వ్యాపారులు కూడ మధ్యాహ్నం వరకు దుకాణాలు తెరుస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పలు పట్టణాల్లో మినీ లాక్‌డౌన్ ను విధించారు.కడప, శ్రీకాకుళం జిల్లాల్లో కూడ మినీ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. ఏడాది లోపు మూడు దశలలో నైవేధ్య సమర్పణ, భక్తులుకు ప్రసాదాల పంపిణి, అన్నప్రసాద సముదాయంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన బియ్యాన్ని వినియోగిస్తామని పేర్కొన్నారు. దర్శనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని..స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తులును నిర్బంధంగా ఆపలేమన్నారు.