Begin typing your search above and press return to search.
ప్యూన్ ఉద్యోగానికి 15 లక్షల మంది అప్లై..ఎక్కడంటే?
By: Tupaki Desk | 29 Sep 2021 8:30 AM GMTదాయాది దేశమైన పాకిస్తాన్ లో నిరుద్యోగం రేటు గణనీయంగా పెరిగింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో నిరుద్యోగం రేటు 6.5 శాతంగా ఉందని పేర్కొన్నప్పటికీ, డేటా వేరే విధంగా ఉన్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. పాకిస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్ మెంట్ ఎకనామిక్స్ ప్రకారం, నిరుద్యోగ రేటు 16 శాతం కంటే ఎక్కువగా ఉంది. నిరుద్యోగ రేటు రోజురోజుకు పెరుగుతుందని.. దేశంలో కనీసం 24 శాతం మంది విద్యావంతులు నిరుద్యోగులుగా ఉన్నారని పీఐడీఈ పేర్కొంది. దీనికి ఉదాహరణగా.. ప్యూన్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగల గురించి డేటాలో వెల్లడించింది.
ఇటీవల దేశంలోని ఒక హైకోర్టులో ప్రకటించిన ప్యూన్ ఉద్యోగం కోసం ఏకంగా 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, దేశంలో పెరుగుతున్న నిరుద్యోగానికి ఇదే నిదర్శనమంటూ పేర్కొంది. అయితే, ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంఫిల్, డిగ్రీ హోల్డర్లు ఉన్నారని పాకిస్తాన్ మీడియా తెలిపింది. కాగా, స్టాండింగ్ కమిటీకి ఇచ్చిన నివేదికలో 40 శాతం విద్యావంతులు – అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ పూర్తిచేసినవారు నిరుద్యోగులుగా ఉన్నారని తెలిపింది. విద్యా పరంగా పరిశోధనలు కూడా తక్కువగానే జరుగుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి.
ఇదిలాఉంటే పాకిస్తాన్ లో బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రచురించిన ఒక సర్వే ప్రకారం.. పాకిస్తాన్ లో 2017-18లో నిరుద్యోగం 5.8 శాతంగా ఉందని.. 2018-19లో 6.9 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. ఇమ్రాన్ నేతృత్వంలోని తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ప్రభుత్వంలో నిరుద్యోగ రేటు భారీగా పెరిగినట్లు మీడియా తెలిపింది. పురుషుల నిరుద్యోగ రేటు 5.1 శాతం నుంచి 5.9 శాతానికి, మహిళా నిరుద్యోగ రేటు 8.3 శాతం నుంచి 10 శాతానికి పెరిగినట్లు డాన్ నివేదించింది.