Begin typing your search above and press return to search.
దేశంలో ఐఏఎస్ అధికారులు ఇంత పేదవారా?
By: Tupaki Desk | 14 Sep 2015 7:04 AM GMTదేశంలో అత్యుత్తమ సర్వీసుల్లో మొదటిస్థానంగా చెప్పుకునే ఐఏఎస్ అధికారుల రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జీతభత్యాలతో పాటు.. వారికుండే హోదా.. పరపతి.. అంతా ఓ రేంజ్ లో ఉంటుంది. మరి.. ఇంత పరపతి.. హోదా ఉండే వారి ఆస్తులు ఏ స్థాయిలో ఉంటాయన్నది చాలామందికి తెలిసిందే.
అలా అని.. ఐఏఎస్ లలో అందరూ సంపన్నులేనని చెప్పటం లేదు కూడా. వారిలోనూ నీతిగా.. నిజాయితీగా ఉన్నోళ్లు చాలామందే ఉన్నారు. అలా అని వారు ఆస్తులేమీ లేనంత పేదవారిగా ఉండే అవకాశమే లేదు. కానీ.. దేశ వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్ లకు సంబంధించి ఆస్తుల వివరాలు అందజేయాలని కోరగా.. వారిలో పలువురు తమకు ఆస్తులేమీ లేవని పేర్కొనటం చూస్తే విస్మయం చెందక తప్పదు.
దేశవ్యాప్తంగా మొత్తం ఐఏఎస్ అధికారులు 4526 మంది ఉంటే.. వారిలో 661 మంది అధికారులు తమ ఆస్తుల వివరాలే అందజేయలేదు. ఇక.. మిగిలిన వారిలో 559 మంది తమకు అస్సలు ఆస్తులే లేవని పేర్కొనటం విశేషం. మొత్తం ఐఏఎస్ లలో వివరాలు ఇవ్వని 661 మందిని తీసేస్తే.. 3825 మంది తేలతారు. వీరిలో సుమారు 17 శాతం వరకూ అధికారులు తమకు పైసా ఆస్తి లేదని అధికారికంగా పేర్కొనటం చూస్తే.. దేశంలోనే అత్యుత్తమ సర్వీసుల్లో పని చేసే వారు మరీ ఇంత పేదగా ఉంటారా? అనిపించక మానదు.
అధికారుల పేర్ల మీద ఆస్తులు లేకున్నా.. వారి కుటుంబ సభ్యలు మీద ఆస్తులు ఉండటం.. వాటి వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేకపోవటంతో.. ఐఏఎస్ లు మరీ పేదవారిగా కనిపిస్తున్నారని చెప్పక తప్పదు. చూస్తుంటే.. రాజకీయ నాయకుల మాదిరే.. ఐఏఎస్ అధికారుల సైతం తమ ఆస్తుల వివరాల వెల్లడిని ఒక ఫార్సుగా భావిస్తున్నట్లు ఉంది.