Begin typing your search above and press return to search.
15 రాష్ర్టాల కోర్టుకు వెళితే ట్రంప్ తగ్గుతాడా?!
By: Tupaki Desk | 9 Sep 2017 4:54 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిత్వం విషయంలో మరో సందేహం నెలకొంది. యువ వలసదారుల రక్షణను రద్దు చేయాలన్న అధ్యక్షుడి ట్రంప్ నిర్ణయం అమలును అడ్డుకోడానికి అమెకాలోని 15 రాష్ట్రాలు - కొలంబియా జిల్లా ప్రభుత్వంపై దావా వేశాయి. న్యూయార్క్ అటార్నీ జనరల్ ఆ యువ మైగ్రెంట్లను ‘అమెరికాలో అత్యంత ప్రతిభావంతులు’ గా ముద్ర వేశారు. పిల్లలుగా ఉన్నప్పుడు అమెరికాలోకి వచ్చి ఇప్పుడు యువతీ యువకులయిన వారిని ‘అక్రమ వలసదార్లు’ గా ముద్రవేసి వారికి క్షమాభిక్ష పెట్టే ఒబామా పథకాన్ని రద్దు చేయాలని ఇటీవల ట్రంప్ నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 7000 మంది ఇండియన్ అమెరికన్లతో సహా మొత్తం 8,00,000 మంది భవిష్యత్తు దెబ్బతింటుంది.
ఇలా అక్రమ వలసలుగా ఉన్న వారందర్నీ వారివారి దేశాలకు డిపోర్టు చేయాలని ట్రంప్ లక్షం. ఆయన చర్యను నిరసిస్తూ బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో దావా దాఖలయింది. అది రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయమని ప్రకటించాలని కోర్టును కోరారు. ‘డిఫర్డు యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్స్ (డిఎసిఎ)’ కార్యక్రమం రాజ్యాంగానికి అనుగుణమైనదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. మెక్సికన్ మూలాలు గలవారిని శిక్షించాలన్న ట్రంప్ ప్రకటిత లక్షం ఈ నిర్ణయంలో ద్యోతక మవుతున్నట్లు ఫిర్యాదీలు ఆరోపించారు. వారు డెమొక్రాట్స్ అనుబంధ అటార్నీ జనరల్స్. ‘డ్రీమర్స్ అని పిలిచే డీఎసీఏ వలసదార్లు ఉన్న రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్స్ వారు. ఆయా రాష్ట్రాల్లో 100 మంది నుంచి, 10,000 దాకా డీఏసీఏ డ్రీమర్లు ఉన్నారు. వారంతా పిల్లలుగా ఉన్నప్పుడు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించి ఇప్పుడు యువతీ యువకులుగా ఎదిగారు. వారందర్నీ వలస పత్రాలు లేని అక్రమ ఇమ్మిగ్రెంట్లుగా ట్రంప్ ప్రభుత్వం పరిగణించడాన్ని రాష్ట్రాలు సవాలు చేశాయి. ట్రంప్ యోచన క్రూరమైనదని న్యూయార్క్ అటార్నీ జనరల టీ. స్నీడర్ మ్యాన్ విమర్శించారు. న్యూయార్క్‌లో అటువంటి 42,000 మంది రక్షిత ఇమ్మిగ్రెంట్లు ఉన్నారని, వారందరూ నమూనా పౌరులుగా పేర్కొనదగ్గవారని కూడా ఆయన చెప్పారు. ఒరేగాన్ అటార్నీ జనరల్ ప్రభుత్వ చర్య సమర్థించలేనిదని వ్యాఖ్యానించారు. ఈ లావాదేవీకి న్యూయార్క్ - మెసచుసెట్స్ - వాషింగ్టన్ - కన్నెక్టికట్ వగైరా 15 రాష్ట్రాలను కక్షిదార్లుగా పేర్కొన్నారు.
డ్రీమర్లకు వ్యతిరేకంగా ట్రంప్ నిర్ణయాన్ని ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా విమర్శించారు. 8 లక్షల మందికి వర్క్ పర్మిట్లు రద్దు చేసి, వారందర్నీ వెనక్కి పంపే ‘క్షమాభిక్ష రద్దు’ నిర్ణయం పర్యవసానాలు విధ్వంసకరంగా ఉంటాయని ఐదుగురు ఇండియన్ అమెరికన్ చట్టసభ సభ్యులు వ్యాఖ్యానించారు. కుటుంబాలను విచ్ఛి న్నం చేసి, యువ తీ యువకులను వారివారి దేశాలకు వెనక్కిపంపే వినాశకర నిర్ణయం ఇదని డెమొక్రాటిక్ సెనెటర్ కమలా హారిస్ విమర్శించారు. ఈ నిర్ణయం ద్వారా ట్రంప్ 8,00,000 యువతీ యువకుల భవిష్యత్తును చిన్నాభిన్నం చేయబోతున్నారని మరో చట్టసభ డెమొక్రాట్ సభ్యురాలు ప్రమీ లా జయపాల్ అన్నారు. తన విద్వేషభావాలను, విదేశీ ద్వేషాన్ని ట్రంప్ మరోసారి బయటపెట్టుకున్నారని జయపాల్ వ్యాఖ్యానించారు.