Begin typing your search above and press return to search.

బాయ్ ఫ్రెండ్ మత్తులో పడి 15 ఏళ్ల అమ్మాయి తండ్రిని చంపేసింది

By:  Tupaki Desk   |   20 Aug 2019 6:36 AM GMT
బాయ్ ఫ్రెండ్ మత్తులో పడి 15 ఏళ్ల అమ్మాయి తండ్రిని చంపేసింది
X
ఎటు వెళుతున్నాం? ఏమై పోతున్నాం? మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. తెలిసిన వారిని నమ్మలేం. స్నేహితుడ్ని విశ్వాసంలోకి తీసుకోలేం. బంధువుల్ని దగ్గరకు రానివ్వలేం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. కట్టుకున్న భర్తను భార్య.. కొడుకును తండ్రి.. తల్లిని కొడుకు.. తాతను మనమళ్లు.. ఇలా ఎన్నో దారుణాలు ఈ మధ్యన వింటున్నాం.. చూస్తున్నాం. వీటన్నింటికి పరాకాష్ఠ లాంటి ఉదంతం తాజాగా వెలుగు చూసింది.

తొమ్మిదో తరగతి చదివే ఒక అమ్మాయి.. బాయ్ ఫ్రెండ్ మత్తులో పడిపోయి ఏకంగా తండ్రిని చంపేసిన వైనం షాక్ కు గురి కావటమే కాదు.. ఇక.. ఎవరిని నమ్మాలి? ఎందుకు నమ్మాలి? అన్న భయాందోళనకు గురయ్యేలా చేసే ఉదంతం బెంగళూరు మహానగరంలో చోటు చేసుకుంది. సంపన్నుల కుటుంటానికి చెందిన 15 ఏళ్ల అమ్మాయిని.. ఈ వయసులో బీకాం చదివే కుర్రాడితో నీకేం స్నేహం అని మందలించటం.. తన మొబైల్ ఛాటింగ్ కు దూరం చేయటాన్ని జీర్ణించుకోలేక.. బాయ్ ఫ్రెండ్ తో కలిసి అమానుషంగా చంపేసిన వైనం షాక్ కు గురి చేస్తోంది.

సంచలనంగా మారటమే కాదు.. కుటుంబ సంబంధాల మీద కొత్త అనుమానాలు తెప్పించేలా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే.. పాండిచ్చేరికి చెందిన ఒక జైన్ కుటుంబం పన్నెండేళ్ల క్రితం బెంగళూరుకు వచ్చి స్థిరపడింది. స్థానికంగా వ్యాపారం చేసే సదరు కుటుంబ పెద్ద జయకుమార్ కు రాజాజినగర్ లో విలాసవంతమైన భవనం ఉంది. అక్కడికి సమీపంలోనే అతని వ్యాపార సంస్థ ఉండేది. ఆయనకు తొమ్మిది తరగతి చదివే కుమార్తె.. మరో చిన్న కుమారుడు ఉన్నారు.

ఇదిలా ఉంటే.. తన పదిహేనేళ్ల కుమార్తె అనునిత్యం మొబైల్ పట్టుకొని ఉండటం.. దాన్లో లీనమైపోవటమే కాదు.. తరచూ ఛాటింగ్ చేసే ధోరణిని గుర్తించాడు. లోతుగా ఆరా తీస్తే.. బీకాం చదివే కుర్రాడితో స్నేహం చేస్తుందని తెలిసి అలెర్ట్ అయ్యాడు. తొమ్మిది తరగతి చదివే నీకు.. బీకాం చదివే కుర్రాడితే స్నేహం ఏమిటని మందలించి.. మొబైల్ దొరక్కుండా పరిమితులు విధించాడు. కట్టడి చేసే ప్రయత్నం చేశారు. చిన్న వయసులో ఇదే మాత్రం మంచిది కాదని సున్నితంగా చెప్పాడు. స్నేహితుడి మొహంలో పడిపోయిన ఆ అమ్మాయి విచక్షణ మరిచింది. తనకు.. తన బాయ్ ఫ్రెండ్ కు అడ్డుగా వస్తున్న తండ్రిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది.

దీనికి సదరు బాయ్ ఫ్రెండ్ చేయూతను ఇవ్వటంతో తన ప్లాన్ ను అమల్లోకి పెట్టేసింది. తన తల్లి.. సోదరుడు ఊరికి వెళుతున్న నేపథ్యంలో వారిని రైల్వే స్టేషన్ వద్ద దింపి వచ్చేందుకు వెళ్లేముందు.. మత్తు బిళ్లల్ని కలిపిన పాలను తండ్రికి ఇచ్చింది. రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తూ బాయ్ ఫ్రెండ్ ను వెంట తీసుకొచ్చింది. అప్పటికే మత్తులో పడిపోయిన తండ్రిని స్నేహితుడితో కలిసి చాకుతో గొంతు కోసి హతమార్చింది.

అనంతరం హత్యా నేరం నుంచి తప్పించుకోవటానికి తండ్రి డెడ్ బాడీని బాత్రూంకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలపెట్టింది. అయితే.. పెట్రోల్ పోసి నిప్పు అంటించటంతో మంటలు ఎక్కువగా రావటంతో ఆమెకు.. అతడి ప్రియుడికి గాయాలు కావటంతో పక్కింటి వారికి ఈ ఉదంతం తెలిసింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బాయ్ ఫ్రెండ్ మత్తులో పడి కన్నతండ్రిని కసాయి కంటే దారుణంగా హత్య చేయటం.. అది కూడా పదిహేనేళ్ల వయసులోనే కావటం షాకింగ్ కు గురి చేయటమే కాదు.. జీర్ణించుకోలేని రీతిలో మారింది.