Begin typing your search above and press return to search.

ఆ విడాకుల సెటిల్ మెంట్ డీల్ 3700 కోట్లు

By:  Tupaki Desk   |   12 May 2017 7:05 AM GMT
ఆ విడాకుల సెటిల్ మెంట్ డీల్ 3700 కోట్లు
X
క‌ల‌కాలం క‌లిసి ఉంటామ‌ని ప్రామిస్ చేసుకొని మ‌రీ పెళ్లి చేసుకునే వారు.. కాల‌గ‌మ‌నంలో అభిప్రాయ‌బేధాల‌తోనో.. మ‌రే ఇత‌ర కార‌ణాల‌తోనో విడిపోవ‌టం క‌నిపిస్తుంది. విడాకులు మ‌న ద‌గ్గ‌ర కాస్త త‌క్కువే కానీ.. ప్రాశ్చాత్య దేశాల్లో చాలానే ఎక్కువ‌. ప్రాశ్చాత్య సంస్కృతి పుణ్య‌మా అని మ‌న ద‌గ్గ‌ర కూడా ఇప్పుడు విడాకుల జోరు ఓ రేంజ్లో న‌డుస్తోంది. చిన్న చిన్న కార‌ణాల‌కు సైతం.. క‌టీఫ్ చెప్పేసుకొని విడాకులు తీసేసుకొని ఎవ‌రి దారిన వారు బ‌తుకుదామ‌ని అనుకునేవారు చాలామందే.

దాదాపుగా ఇలాంటిదే ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా. కాక‌పోతే.. స‌గ‌టు జీవి మాదిరి కాకుండా.. బిలీయ‌నీర్ ఫ్యామిలీలో న‌డిచిన విడాకుల య‌వ్వారం కావ‌టంతో.. వారి స్థాయికి త‌గ్గ‌ట్లే విడాకుల సెటిల్ మెంట్ సైతం భారీగా మారి.. ప్ర‌పంచ వ్యాప్తంగా వీరి విడాకుల ముచ్చ‌ట అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన విడాకుల కేసు కాదు కానీ.. బ్రిట‌న్ వ‌ర‌కూ మాత్రం ఈ విడాకుల కేసు అత్యంత ఖ‌రీదైన రికార్డును సొంతం చేసుకుంది. 24 ఏళ్లు క‌లిసి ఉన్న ఈ జంట‌.. ఇక‌పై క‌లిసి బ‌త‌క‌లేమ‌ని డిసైడ్ కావ‌ట‌మే కాదు.. భార్య‌కు భ‌ర‌ణంగా స‌ద‌రు భ‌ర్త ఇచ్చిన మొత్తం ఎంతో తెలుసా? అక్ష‌రాల రూ.3700 కోట్లు.

ర‌ష్యాకు చెందిన ఈ బిలియ‌నీర్ దంప‌తులు తొలిసారి 1989లో మాస్కోలో ప‌రిచ‌య‌మ‌య్యారు. వారి ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి పెళ్లి వ‌ర‌కూ వెళ్లిపోయింది. 1993లో పెళ్లి చేసుకున్న ఈ జంట‌.. అదే ఏడాది ర‌ష్యాను విడిచిపెట్టి బ్రిట‌న్ కు వెళ్లిపోయారు. లండ‌న్ లోని సుర్రే ప్రాంతంలో స్థిర‌ప‌డ్డారు. ఇంత‌కాలం క‌లిసి ఉన్న వారిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు చోటు చేసుకోవ‌టంతో.. వారిరువురు విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

కోర్టు చెంత‌కు చేరిన వారి విడాకుల కేసును విచారించిన జ‌స్టిస్ హాడ‌న్ కేవ్ వీరికి విడాకులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. భ‌ర‌ణం కింద త‌న మాజీ భార్య‌కు 584 మిలియ‌న్ డాల‌ర్లు.. మ‌న రూపాయిల్లో అయితే రూ.3700 కోట్లు ఇచ్చేందుకు స‌ద‌రు భ‌ర్త ఓకే చేసేశారు. ఇంత భారీ మొత్తాన్ని ఇచ్చేందుకు భ‌ర్త అంగీక‌రించ‌కున్నా.. స‌ద‌రు న్యాయ‌మూర్తి ఆదేశాల‌తో ఇవ్వ‌క త‌ప్ప‌లేదు. ఈ విడాకుల వ్య‌వ‌హారానికి సంబంధించి భార్య‌భ‌ర్త‌ల పేర్లు.. వారి ఫోటోలు ప్ర‌చురించొద్ద‌ని న్యాయ‌మూర్తి ఆదేశాలు జారీ చేయ‌టంతో వీరి ఫోటోలు.. పేర్లు బ‌య‌ట‌కు రాలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/